Two Indian Teachers Shortlisted for 2021
Global Teacher Prize
‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2021’ జాబితా-50లో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు – వివరాలు ఇవే
వచ్చే నెలలో తుది విజేత ప్రకటన - ఎంపికైన వారికి రూ.7.37 కోట్ల బహుమతి
గ్లోబల్ టీచర్ ప్రైజ్-2021 తుది 50 మంది జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మేఘన
ముసునూరి చోటు దక్కించుకున్నారు. ఆమె మియాపూర్ సమీపంలోని హైదర్‌నగర్‌లో ఫౌంటెయిన్‌హెడ్
గ్లోబల్ స్కూల్, జూనియర్ కళాశాల వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. సాంఘికశాస్త్రం, ఆంగ్లం,
గణితం సబ్జెక్టులను బోధిస్తుంటారు.
ఉపాధ్యాయ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా
భావించే గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను యూకేకు చెందిన వర్కీ ఫౌండేషన్ ఏటా
అందిస్తుంది. 2021 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల నుంచి 8వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు
చేసుకున్నారు. వివిధ స్థాయుల్లో వడపోత తర్వాత తుది 50 మంది
విజేతల జాబితాను వర్కీ ఫౌండేషన్ గురువారం ప్రకటించింది. వీరిలోంచి వచ్చే నెలలో
టాప్-10 మందిని ఎంపిక చేసి.. వారిలోంచి విజేతను
ప్రకటిస్తారు. విజేతకు రూ.7.37 కోట్ల(మిలియన్ అమెరికా
డాలర్లు) నగదు బహుమతి అందిస్తారు.
సామాజిక సేవల్లోనూ..
మేఘన సేవ్ వాటర్ అండ్ నేచర్(స్వాన్)
స్వచ్ఛంద సంస్థను స్థాపించి చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మై ఎడ్యుగురూ
సీఈవోగా ఉన్నారు. గూగుల్ విమెన్ ఎంట్రపెన్యూర్ ఆన్ ది వెబ్ హైదరాబాద్
ఛాంపియన్‌గా ఎంపికయ్యారు. గతేడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ ఎక్స్‌లెన్స్
అవార్డు దక్కించుకున్నారు. ఐరాస అందించే గ్లోబల్ ఫెలోషిప్-2019ను అందుకున్నారు.
బిహార్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు
సత్యం మిశ్ర సైతం మన దేశం నుంచి టాప్-50 జాబితాలో చోటు
దక్కించుకున్నారు.
We’re thrilled to introduce you to the top 50 finalists of the US $1 million Global Teacher Prize 2021, in partnership with @UNESCO. These teachers have been selected from over 8,000 nominations and applications from 121 countries. #TeachersMatter #GlobalTeacherPrize pic.twitter.com/V4llCUA9fw
— Global Teacher Prize (@TeacherPrize) September 9, 2021
0 Komentar