Unvaccinated People Were 11
Times More Likely to Die of Covid-19, CDC Report
రెండు డోసులు తీసుకున్న వారికి మరియు
అసలు టీకా వేయించుకొని వారి గురించి అమెరికా సంస్థ CDC అధ్యయనంలోని వివరాలు
ఇవే
కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని అమెరికా అధ్యయనం వెల్లడించింది. అలాగే టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించిన మూడు అధ్యయనాల్లో ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా తగ్గిస్తోందని అధ్యయనం తెలిపింది.
అధ్యయనం ఇలా..
జూన్-ఆగస్టు నెలల్లో ఆసుపత్రులు, అత్యవసర
విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై అధ్యయనం చేసి సెంటర్
ఫర్ డీసీజ్ కంట్రోల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అన్ని వయసుల వారికి
వ్యాక్సిన్లు 86 శాతం ఆసుప్రతిలో చేరకుండా రక్షణ కల్పించాయి.
కానీ, 75 ఏళ్లు దాటిన వారికి అది 76
శాతంగా పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. ఏదేమైనప్పటికీ టీకాలు అధిక వయసు గలవారికి రక్షణ
కల్పిస్తున్నాయని అధ్యయనంలో నిరూపితమైంది. ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చికిత్స తీసుకోవడం వంటి వాటి నుంచి 82 శాతం
కంటే ఎక్కువ మందికి ఈ టీకాలు రక్షణ కల్పించాయి.
New @CDCMMWR shows fully vaccinated people had >10x lower risk of hospitalization or death from #COVID19 compared with those not fully vaccinated. The best way to protect yourself & those around you is to #SleeveUp. More: https://t.co/7GBRXOApe7. pic.twitter.com/Te4CyBJZsy
— CDC (@CDCgov) September 10, 2021
0 Komentar