UPSC Declares Civil Services Examination
2020 Final Results, 761 Candidates Pass
సివిల్స్-2020 ఫలితాలు విడుదల - మొత్తం 761
మంది ఎంపిక - తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైంది వీరే
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల
నియామకం కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని
ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. వీరిలో 545 మంది
పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు
చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శుభం కుమార్ మొదటి ర్యాంకుతో మెరిశారు.
జాగృతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్ మూడో ర్యాంకు
సాధించారు.
సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు
తెలుగు రాష్ట్రాలకు చెందిన
అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు
సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్
84వ ర్యాంకు, యశ్వంత్ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్
సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు,
డి. విజయ్ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి 747వ ర్యాంకు సాధించారు.
అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఎంపిక..
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు
మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు సివిల్స్‌లో సత్తా చాటారు. రాళ్లపల్లి జగత్‌సాయి 32వ
ర్యాంకు, వసంత్ కుమార్ 170వ ర్యాంకు
సాధించారు. వీరి తండ్రి భీమేశ్వరరావు విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. గుండుగొలను
గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒకేసారి సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల గ్రామస్థుల
హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్ ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్ నిట్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు.
ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2015లో యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబి సోదరి రియా దాబి 15వ ర్యాంకు సాధించారు.,
తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైంది వీరే 👇👇
0 Komentar