How to Use Voice Assistant Alexa APP in Mobile
and How to Enable Amitabh Bachchan Voice in Your Alexa
ఆండ్రాయిడ్ ఫోన్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని ఎలా ఉపయోగించాలి? అలెక్సాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ – వివరాలు ఇవే
ప్రస్తుతం మొబైల్, ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌లలో అందుబాటులో వర్చువల్ వాయిస్ అసిస్టెంట్‌లు కూడా దాదాపు యూజర్ చెప్పిన అన్ని పనులు చేసేస్తున్నాయి.
యాపిల్ సిరి, గూగుల్
వాయిస్ అసిస్టెంట్‌లతో పోలిస్తే అమెజాన్ అలెక్సా ప్రత్యేకం. దీని వాయిస్ మనుషుల
వాయిస్‌కి కాస్త దగ్గరగా ఉంటుందనేది టెక్ నిపుణులు మాట. అయితే ఈ వర్చువల్
అసిస్టెంట్ కేవలం అమెజాన్ ఉత్పత్తుల్లో మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. ఇతర
వర్చువల్ అసిస్టెంట్లకు ఏ మాత్రం తీసిపోకుండా అలెక్సా కూడా ఫోన్ కాల్స్ చేయడం,
టైమ్ చెప్పడం, న్యూస్ చదవడం, నగదు మార్పిడి, టైమర్ ఆన్ చేయడంతోపాటు మన ఇంటిని
స్మార్ట్ హోమ్‌గా మార్చేస్తుంది.
ఇంట్లో మనం రోజువారీ ఉపయోగించే
వస్తువులను కూడా అలెక్సా యాప్‌తో అనుసంధానించుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు
అందిస్తున్న అలెక్సాను మీ ఆండ్రాయిండ్ ఫోన్‌లో ఎప్పుడైనా ఉపయోగించారా?లేదా?
మరి ఆండ్రాయిడ్ ఫోన్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఎలా
ఉపయోగించాలి? మనకు నచ్చినట్లుగా అలెక్సాను ఎలా కస్టమైజ్
చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
⊛ ముందుగా
ప్లేస్టోర్ నుంచి అలెక్సా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
⊛ అలెక్సా
యాప్ ఓపెన్ చేసి మీ అమెజాన్ ఖాతాతో లాగిన్ చేయాలి. ఒకవేళ మీకు అమెజాన్ ఖాతా
లేకుంటే సైన్ ఇన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అమెజాన్ ఖాతా ఓపెన్ చేయాలి.
⊛ తర్వాత
హెల్ప్ అలెక్సా గెట్ టు నో యు (Help Alexa Get To Know You) ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ పేరు టైప్ చేసి కింద ఉన్న అలో (Allow) ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్‌బుక్ లోని నంబర్లు అలెక్సాలో వచ్చి
చేరుతాయి.
⊛ అక్కడి
నుంచి స్క్రీన్‌పై కనిపిస్తున్న సూచనలు పాటిస్తే యాప్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయనేది
తెలుస్తుంది. తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అలెక్సాను ఉపయోగించి పనులు
చక్కబెట్టేయ్యొచ్చు.
⊛ అలానే అలెక్సా యాప్‌లో డివైజెస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆల్ డివైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అందులో ‘అలెక్సా ఆన్ దిస్ ఫోన్’ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి మీ ప్రాంతం, టైమ్ జోన్, మీకు కావాల్సిన ఇతర ఫీచర్స్‌ని సెలక్ట్ చేసుకుంటే ఆయా సేవలను అలెక్సా మీకు అందిస్తుంది.
అలెక్సాలో అమితాబ్ బచ్చన్ వాయిస్
తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హీరో
అమితాబ్ బచ్చన్ ను కలవాలనుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యం
కాకపోవచ్చు. అయితే, ఆయన వాయిస్ ను మాత్రం వినే అవకాశాన్ని
అమెజాన్ కల్పించింది. ఎలాగంటారా..? అలెక్సా పవర్ డివైస్
ద్వారా బిగ్ బి వాయిస్ ను వినచ్చు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది.
భారతదేశపు మొట్టమొదటి సెలబ్రిటీ వాయిస్ అందుబాటులోకి వచ్చింది.
ఎలా వినొచ్చంటే...?
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు
ముందుగా అమెజాన్ షాపింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో మైక్ బటన్ ను నొక్కి బిగ్ బి వాయిస్ ను యాడ్ చేసుకోవాలి. ఈ
వాయిస్ ఫీచర్ ను ఎనబుల్ చేసుకోవడానికి సంవత్సరానికి రూ.149 కట్టాల్సి ఉంటుంది.
దీంతో బిగ్ బి చెప్పే కథలు, పద్యాలు, టంగ్
ట్విస్టర్స్, స్ఫూర్తిదాయమైన సందేశాల్లాంటివి వినే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా వాతావరణ విషయాలు, షాపింగ్ అప్ డేట్స్ తో పాటు
పాటలు కూడా ప్లే చేసుకోవచ్చు. మైక్ ను నొక్కి 'అమిత్ జి'
ప్లే సాంగ్స్ అంటే చాలు మన స్మార్ట్ ఫోన్లో పాటలు మోగుతాయి.
అమెజాన్తో కలిసి పనిచేయడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. 'అలెక్సాతో వాయిస్ ను పరిచయం చేయడం నాకొక కొత్త అనుభూతినిచ్చింది. సరికొత్త వాయిస్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నా శ్రేయోభిలాషులు నాతో మాట్లాడబోతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని గురించి వారి రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను' అని అన్నారు.
బిగ్ బి వాయిస్ ను యాడ్
చేసుకోవాలిలా...
* ముందుగా అమెజాన్ షాపింగ్ యాప్లో
మైక్ ను నొక్కి పట్టి 'అలెక్సా.. ఇంట్రడ్యూస్ మీ టూ అమితాబ్ బచ్చన్
అనే కమాండ్ ను ఇవ్వాలి.
* తర్వాత 'అలెక్సా..ఎనబుల్
అమిత్ జి వేక్ వర్డ్ అనే ఫీచర్ ను ఎనబుల్ చేసుకోవాలి.
* అమెజాన్ యాప్ లోని అలెక్సా
సెక్షన్ కు వెళ్లి సెట్టింగ్స్ లో 'అమిత్ జి' అనే వర్డ్ ను ఎనేబుల్ చేయాలి.
* ఒకసారి వేక్ వర్డ్ ను ఎనేబుల్
చేశాక మనకు కావాల్సిన సదుపాయాలను అలెక్సా అందిస్తోంది.
* హిందీ, ఇంగ్లీష్
భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ భాషను మార్చుకోవాలనుకుంటే 'అలెక్సా స్పీక్ ఇన్
హిందీ/ఇంగ్లీష్' అనే సందేశాన్ని ఇస్తే సరిపోతుంది.
0 Komentar