World Alzheimer's Day 2021: Early
Symptoms of Alzheimer's and Their Impact on Day-to-Day Activities
ఆల్జీమర్ వ్యాధి అంటే ఏంటి? అల్జీమర్ రాకుండా ఏం చెయ్యాలి?
చాలా మంది మతిమరపునే ఆల్జీమర్
వ్యాధి అనుకుంటారు. అది నిజం కాదు. అది వేరు. ఇది వేరు. మతిమరపు కంటే భయంకరమైనది
అల్జీమర్ వ్యాధి. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక మెదడుకు సమస్యే. ప్రతీ క్షణం నరకమే.
ఎప్పుడు ఏం మర్చిపోతారో అర్థం కాదు. భోజనం తింటూ... ఎలా తినాలో మర్చిపోతారు.
నడుస్తూ... నడవడం ఎలాగో మర్చిపోతారు. అంత ప్రమాదకరమైనది ఈ వ్యాధి. ప్రస్తుతం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఈ వ్యాధి వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే
ప్రపంచ ఆల్జీమర్స్ డే (World Alzheimer’s day) నాడు... ఈ వ్యాధి
రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాయి ప్రపంచ దేశాలు.
ఇది మీకు తెలుసా?
ప్రపంచంలో ప్రతి 3
సెకండ్లకూ ఒకరికి అల్జీమర్ (Alzheimer) సోకుతోందని అల్జీమర్
డిసీజ్ ఇంటర్నేషనల్ (ADI) సంస్థ తెలిపింది. అంటే మిగతా
వ్యాధుల కంటే ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్‌లా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఈ
కారణంగానే... ఈ రోజున లక్షల స్వచ్ఛంద సంస్థలు ఈ వ్యాధికి మందు కనుక్కునే అంశంపై
చర్చిస్తున్నాయి. కానీ ఏం చెయ్యాలి, ఎలా నయం చేయాలన్నదే
సమాధానం లేని ప్రశ్న అవుతోంది.
చరిత్ర ఇదీ:
ఇంత ప్రమాదకరమైన వ్యాధిపై ఒక్క
రోజు చర్చిస్తే సరిపోదు కదా... అందుకే నెలపాటూ చర్చిస్తున్నారు. అందులో భాగంగానే
ఒక రోజును ప్రత్యేకించి కేటాయించారు. ఈ నెలంతా అల్జీమర్ నియంత్రణ సంస్థలు రకరకాల
అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ వ్యాధి తీవ్రతను ప్రజలకు
తెలుపుతున్నాయి. అలర్ట్ చేస్తున్నాయి. ది పర్పుల్ ఎలిఫేంట్ డాట్ కామ్ (thepurpleelephant.com)
లాంటి సంస్థలు టొరంటో, నయాగరా, చికాగో, న్యూ ఒర్లియాన్స్, వాంకోవర్
వంటి నగరాల్లోని భవనాలకు పర్పుల్ కలర్ లైటింగ్స్ ఇస్తున్నాయి. ఇలాంటి ఎన్నో
సంస్థలు ఈ నెలలో ఒక్కటై వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నాయి.
1994లో ప్రారంభం:
1994లో ADI పదో వార్షికోత్సవం సందర్భంగా అల్జీమర్స్ డేను ప్రారంభించారు. ఈ సంస్థ
అల్జీమర్‌తోపాటూ... చిత్తవైకల్యం (Dementia)పై ప్రజలకు
అవగాహన కలిగిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ...
ప్రాక్టికల్ వర్క్‌షాపులు పెట్టి... స్వచ్ఛంద సేవకులతో ప్రజలను అప్రమత్తం
చేస్తోంది. ముసలితనం వచ్చాక, మతిమరపు, చిత్తవైకల్యం,
అల్జీమర్ వంటివి రాకుండా ఏం చెయ్యాలో చెబుతోంది.
అల్జీమర్ రాకుండా ఏం చెయ్యాలి:
మందు లేని ఈ వ్యాధి రాకుండా
ఉండాలంటే... మన మెదడుకు పని చెబుతూనే ఉండాలి. రకరకాల పజిల్స్ ఆడాలి. లెక్కలు
చేస్తూ ఉండాలి. సుడోకు లాంటివి ఆడాలి. అలాగే.. బాగా చదవాలి. మెదడుకు మేలు చేసే
ఖర్జూరాలు తినాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, గింజలు, పప్పులు, డ్రైఫ్రూట్స్
ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజ్ తినేవారైతే వారానికి ఓసారి చేపలు, వారానికి రెండుసార్లు చికెన్ వంటివి తినాలి. బ్రెయిన్‌కి పని
చెబుతున్నంతకాలం... అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు
సూచిస్తున్నారు.
0 Komentar