World Rabies Day 2021: Know Its History,
Significance and Theme
నేడు ప్రపంచ రాబిస్ దినోత్సవం: చరిత్ర, ప్రాముఖ్యత
మరియు అవగాహన గురించి తెలుసుకోండి
ప్రపంచ రాబిస్ దినోత్సవం అనేది
అంతర్జాతీయంగా అవగాహన కోసం గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్, సంయుక్త
రాష్ట్రాలలో ప్రధాన కార్యాలయంతో నడుస్తుంది.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28
న ప్రపంచ రాబిస్ దినోత్సవం లూయిస్ పాశ్చర్ మరణించిన రోజు సందర్భంగా జరుగుతుంది. పాశ్చర్
తన సహోద్యోగుల సహకారంతో, మొదటి సమర్థవంతమైన రాబిస్
వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.
ప్రపంచ రేబిస్ దినోత్సవం మానవులు
మరియు జంతువులపై రేబిస్ ప్రభావం గురించి అవగాహన పెంచడం, ప్రమాదంలో
ఉన్న సమాజాలలో వ్యాధిని ఎలా నివారించాలో సమాచారం మరియు సలహాలను అందించడం మరియు
రాబిస్ నియంత్రణలో పెరిగిన ప్రయత్నాల కోసం మద్దతునివ్వడం.
Theme for World Rabies Day 2021 is
‘Rabies: Facts, not Fear’,
కుక్కకాటుతో ముంచుకొచ్చే రేబిస్ వ్యాధి కొత్తదేమీ కాదు. కానీ దీన్ని నివారించుకునే విషయంలోనే ఇప్పటికీ ఎంతోమందికి అవగాహన ఉండటం లేదు. గాయానికి పసర్లు పూసేవారు కొందరు. కారం, నూనె, పసుపు, సున్నం, ఉప్పు చల్లేవారు కొందరు. దీంతో ఎంతోమంది ప్రాణాల మీదికీ తెచ్చుకుంటున్నారు. మనదేశంలో రేబిస్‌తో ఏటా 20వేల మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో 40% మంది 15 ఏళ్ల లోపువారే. ఒకసారి రేబిస్ వస్తే ప్రాణాలతో బయటపడటం కష్టం. మంచి విషయం ఏంటంటే- రేబిస్ కారక వైరస్ శరీరంలోకి ప్రవేశించాకా సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. సకాలంలో స్పందిస్తే కుక్కకాటు మరణాలను చాలావరకు తప్పించుకోవచ్చనే విషయాన్ని మరవకూడదు.
మనదేశంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 4 కోట్ల వీధి కుక్కలున్నాయని అంచనా. పట్ణణాలు, నగరాలు, గ్రామాలు ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయి. సాధారణంగా కుక్కలు మనల్ని ఏమీ చేయవు గానీ కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. మీద పడి కరిచేస్తుంటాయి. ఇదే రేబిస్‌కు కారణమవుతోంది. పిల్లుల వంటి జంతువులతోనూ రేబిస్ వచ్చే అవకాశమున్నా రేబిస్‌తో మరణిస్తున్నవారిలో నూటికి 99 మంది కుక్కకాటు బాధితులే. రేబిస్ కారక వైరస్‌ను లిస్సా వైరస్ అంటారు. ఇది జంతువుల చొంగలో ఉంటుంది.
కుక్క మనల్ని కరిచినా, శరీరం మీద గాయాలున్న చోట నాకినా, దాని చొంగ ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో లిస్సా వైరస్ ఉన్న కుక్క కరిస్తేనే అది మనకు సోకుతుంది. అయితే కుక్కలో అప్పటికే వైరస్ ఉందో లేదో చెప్పటం కష్టం. చాలామంది పిచ్చికుక్క కరిస్తేనే రేబిస్ వస్తుందని భావిస్తుంటారు గానీ వైరస్ కుక్కలో ఉన్నా దాని ప్రవర్తన మామూలుగానే ఉండొచ్చు. అప్పటికి పిచ్చి కుక్కగా మారకపోయి ఉండొచ్చు. కాబట్టి ఊర కుక్కలు కరిస్తే జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. లిస్సా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత 1-3 నెలల్లోపు ఎప్పుడైనా రేబిస్ రావొచ్చు. కొందరిలో తొలి వారంలోనే రావొచ్చు. కొందరికి ఏడాది తర్వాతా రావొచ్చు. కాబట్టి కుక్క కరిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం అత్యవసరం.
కుక్క కరిచినప్పుడు..
* కుక్క కోరలు మన చేతికి
తాకినప్పుడు, పుండ్లు పగుళ్లు వంటివేవీ లేనిచోట నాకినప్పుడు
పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఆ ప్రాంతాన్ని సరిగా శుభ్రం చేసుకుంటే చాలు.
* రక్తస్రావం లేకుండా కోరలు
పైపైన గీరుకున్నా, చర్మం పైపొర లేచి పోయినా వెంటనే పద్ధతి
ప్రకారం శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి.
* కోరలు లోపలికి దిగినప్పుడు, చర్మం చీరుకుపోయినప్పుడు, గాయం నుంచి రక్తం వస్తున్నప్పుడు.. అలాగే శరీరం మీదున్న పుండ్లను కుక్క నాకినప్పుడు, గాయాలకు కుక్క చొంగ తగిలినప్పుడు తీవ్రంగా పరిగణించాలి. వెంటనే పుండును శుభ్రం చేయాలి. రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ల టీకాలు తీసుకోవాలి. ఇవి సిద్ధంగా ఉన్న రేబిస్ యాంటీబాడీలు. సత్వరం ప్రభావం చూపిస్తాయి. అలాగే యాంటీ రేబిస్ టీకాలు కూడా పూర్తిగా తీసుకోవాలి.
పుండు ఎలా కడగాలి?
కుక్క కరిచిన చోట వైరస్ చాలాకాలం జీవించి ఉంటుంది. కాబట్టి కుక్క కరిచిన వెంటనే.. లేదా వీలైనంత త్వరగా గాయాన్ని ధారగా పడుతున్న నీటి కింద పెట్టి 10-15 నిమిషాల సేపు సబ్బుతో శుభ్రంగా కడగాలి. గాయాన్ని నేరుగా చేత్తో తాకకూడదు. గ్లవుజులు వేసుకుంటే మంచిది. గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్ లోషన్లు రాసి వదిలెయ్యాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి.
బొడ్డు టీకాలు ఇప్పుడు లేవు:
కుక్క కరిస్తే ఒకప్పుడు బొడ్డు
చుట్టూ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. వీటికి చాలామంది భయపడేవారు. ఇప్పుడు అలాంటి భయాలు
అవసరం లేదు. రాబిపూర్ వంటి చిక్/డక్ ఎంబ్రియో టీకాలను చేతులకు, పిరుదులకు
ఇస్తారు. అవసరమైతే కరిచిన చోట కూడా ఇవ్వచ్చు. ఇవి చాలా సురక్షితం. వీటిని కండలోకి,
చర్మంలోకి.. ఇలా రెండు రకాలుగా ఇవ్వచ్చు.
* కండలోకి ఇస్తే- కుక్క
కరచిన రోజున లేదా డాక్టర్ దగ్గకు వచ్చిన రోజున ఒకటి. అప్పట్నుంచి 3, 7,
14, 28 రోజులకు వరుసగా ఇస్తారు.
* చర్మంలోకి ఇస్తే- తక్కువ
మోతాదే సరిపోతుంది. డాక్టర్ దగ్గరకు వచ్చిన వెంటనే 0.1
ఎంఎల్ చొప్పున రెండు చేతులకు రెండు ఇంజెక్షన్లు ఇస్తారు. అనంతరం 3, 7, 28 రోజుల్లోనూ ఇలాగే అదే మోతాదులో ఇంజెక్షన్లు ఇస్తారు.
It's #WorldRabiesDay
— World Health Organization (WHO) (@WHO) September 28, 2021
Although vaccines are available since over a century, #rabies still kills 1⃣ person every 9 minutes. Most of the victims are children.
Rabies is 100% preventable: Let's vaccinate🐕 to reduce rabies deaths!
👉 https://t.co/M74Jg5q9dH pic.twitter.com/aopt24CmSS
0 Komentar