10th Class Telugu Notes 2021-22 – New
Syllabus - PSR Digital Books
10 వ తరగతి తెలుగు నోట్స్ 2021-22 - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్
ముందుమాట
వజ్రం ఎవరినీ వెతకదు, మనమే
దానిని వెతకాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో అనేకమంది అనేక రకాలుగా 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధమయ్యేలా వారి స్వీయశైలిలో
స్టడీమెటీరియల్స్ వ్రాశారు, వ్రాస్తున్నారు. కాని క్లుప్తమైన,
సమగ్రమైన స్టడీమెటీరియల్ విద్యార్థులకు లభించుటలేదు. ఒక వేళ ఉన్నా
అవి అవసరానికి మించి గందరగోళం సృష్టించే విధంగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో 800 పేజీల పెద్ద పుస్తకము చదివే సమయము మరియు ఓపిక విద్యార్థులకు లేదు.
అందువల్ల నేడు 10వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే
విధంగా వినూత్నమైన రీతిలో అనేక అంశాల్ని మూలాలతో సహా సేకరించి సమగ్రమైన స్టడీ
మెటీరియల్ సిద్ధం చేయడం జరిగింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ
పుస్తకం విద్యార్థులకు ప్రింటెడ్ మెటీరియల్ రూపంలోనే కాకుండా ఈ పుస్తకము నందు
పొందుపరిచిన QR code లను స్కాన్ చేయటం ద్వారా దృశ్య, శ్రవణ మాధ్యమం ద్వారా పూర్తి విషయ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుంది.
మరియు అన్ని పాఠ్యాంశాల వద్ద ఏర్పాటు చేసిన QR code ని
స్కాన్ చేసిన వెంటనే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలను online ద్వారా వీక్షించవచ్చు. పదజాలం, వ్యాకరణాంశాలు,
సృజనాత్మకత, భావవ్యక్తీకరణ లాంటి అంశాలు
ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా
విషయసంగ్రహణ సాధ్యమౌతుంది. సగటు మరియు సగటు కంటే తక్కువ అభ్యసన సామర్థ్యం గల
విద్యార్థులు కూడ పబ్లిక్ పరీక్షను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని తెలుగులో తగినంత
పరిజ్ఞానాన్ని పొందగలరు.
ఇప్పటివరకు రాయబడిన పుస్తకాలలో
లేని పాఠ్యాభాగ సారాంశాలు, పరిచిత పద్యాలు-ప్రశ్నలు, రామాయణంలో పాత్రలు, ఆ పాత్రల స్థానంలో నీవుంటే ఏమి
చేస్తావు? లాంటి సృజనాత్మక ప్రశ్నలకు సమాధానాలు విపులముగా
ఇవ్వబడ్డాయి. ప్రాచీనభాషా పరివర్తనం, అపరిచిత పద్యాలు-భావాలు,
పదజాలం మరియు వ్యాకరణాంశాలు అన్ని ఒకే చోట సమగ్రంగా పొందుపరచడం
జరిగింది. ఈ పుస్తకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇతర
స్టడీమెటీరియల్ -కంటే ఇది భిన్నంగా ఉంటుంది. "తేనెటీగ అన్ని రకాల పుష్పాల
నుండి మకరందమును సేకరించి తేనెపట్టు కూర్చినట్లుగా" ఈ పుస్తకం కూడా అంశాల
వారిగా వివరణ, అభ్యాసాలను అందిస్తుంది. ప్రతి అంశాన్ని
నేర్చుకోవటానికి మరియు గుర్తుంచుకోవడానికి మరియు పరీక్షలలో సమాధానాలు రాయడానికి
ఇదొక గొప్ప అభ్యసన సాధనం.
ఈ పుస్తకంలో ప్రశ్నల యొక్క వరుస
సంఖ్యలు ఎక్కడా ఇవ్వబడలేదు. ఎందుకంటే పరీక్షా ప్రశ్నపత్రాల పథకం మరియు నమూనాలలో
తరచుగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను కరోనాకు ముందు మరియు కరోనా కాలం అని
రెండు దశలుగా విభజించుకోవచ్చు. కరోనాకు ముందు పేపర్ 1 మరియు
పేపర్ 2 ఒక్కొక్కటి 50 మార్కులకు రెండు
పేపర్లుగా ఇవ్వబడింది. కాని పబ్లిక్ పరీక్షలు జరగలేదు. కరోనా కాలంలో 2సార్లు 100 మార్కుల పేపరుగా ఇవ్వబడింది. ఈ పబ్లిక్
పరీక్షలు కూడా జరగలేదు. కనుక స్థిర ప్రశ్నలను ఇవ్వలేదు. మేము అన్ని అంశాలను
తప్పకుండా అవసరమైన మేరకు ఇవ్వడం జరిగింది. ఈ అంశాలు పరిపూర్ణంగా చదువుకున్నట్లయితే
పరీక్ష ఏ విధంగా నిర్వహించినా గాని విద్యార్థులు సులభంగా జవాబులు వ్రాయవచ్చు.
రాబోయే పరీక్షలలో ఉత్తమ మార్కులు/గ్రేడును సులభంగా పొందటానికి ఈ పుస్తకం మీకు
ఎంతగానో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ పుస్తకం మీ విజయాన్ని అక్షరసత్యం
చేస్తుందని కూడా ఆశిస్తున్నాను. PSR
2021-22 విద్యాసంవత్సరం 10వ తరగతి తెలుగు నోట్స్
SA1 questions please
ReplyDeletesearch with 'sa1 telugu' in our website
Delete