AP Cabinet: కేబినెట్ కీలక
నిర్ణయాలు ఇవే (28-10-2021)
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు పేర్ని నాని తెలిపారు.
దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల
లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్
సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో
‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు చెప్పారు. అమ్మఒడి పథకానికి 75
శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్ ఆమోదం
తెలిపిందన్నారు. 2021 నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు హాజరును పరిగణనలోకి
తీసుకుంటాం.
కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు
అంశాలు..
►అమ్మఒడి పథకానికి
అర్హత ఉన్న వారందరికీ జూన్, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం
కల్పిస్తాం.
►వైద్య, విద్య,
కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం
►కొత్తగా
1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ అంగీకారం.
►560 అర్బన్
హెల్త్ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం.
►వైద్య కళాశాలల్లో
2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►ఇప్పటి వరకు
మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►వైద్య ఆరోగ్యశాఖలో
41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం.
►రైతులకు
9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్
ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
►శ్రీశారదా
పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదం.
►అనంతపురం
జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.
►కొత్తగా జైన్, సిక్కు
కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
►అగ్రవర్ణాల
సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
►సినిమాటోగ్రఫీ
చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
►జయలక్ష్మీ
నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు
ఆమోదం.
►పీపీపీ విధానంలో
శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం.
►రాష్ట్రంలో
5చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్
ఆమోదం.
►ప్రకాశం జిల్లాలో
జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.
0 Komentar