AP
Covid-19 Media Bulletin 28-10-2021
ఏపీలో
కొత్తగా 381 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,896 పరీక్షలు నిర్వహించగా.. 381 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,65,235 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఒక్కరు మరణించారు. దీంతో
రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,365కి చేరింది.
24 గంటల వ్యవధిలో 414 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,46,127
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,743 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,94,04,281
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
0 Komentar