AP NTSE 2022: All The Details Here - Examinaton Postponed
===================
UPDATE ON 19-01-2022
NCERT NEW DELHI ఆదేశాల
మేరకు రాష్ట్రం లో ది. 23-01-2022 న జరగవలిసిన ఎన్.టి.యస్.ఇ
(1st లెవెల్) పరీక్ష కరోనా మహమ్మరి మరియు పరిపాలన
పరమైన కారణాల రీత్యా వాయిదా వేయటం జరిగినది. పరీక్ష తేదీ ను NCERT వారి సూచన ప్రకారం త్వరలో ప్రకటించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు
తెలియజేసారు. మరిన్ని వివరముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో
గాని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి website నందు గాని
సంప్రదించగలరు.
=======================
23-01-2022 న జరగబోవు ఎన్.టి.యస్.ఇ
(1st
లెవెల్) పరీక్ష కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 10 వ తరగతి
చదువుచున్న విద్యార్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
రాష్ట్రం లోని అన్ని గుర్తింపు
పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సి.బి.యస్.ఐ మరియు ఐ.సి.యస్.ఇ ల
నుండి గుర్తింపు పొందిన విద్యాలయాలలో చదువుచున్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష
వ్రాయుటకు అర్హులు. 18 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటి సారి
10వ తరగతి పరీక్షల కు హాజరు అవుతున్న విద్యార్థులు కూడ ఈ పరీక వ్రాయుటకు అర్హులు.
ఎన్.టి.యస్.ఇ (1st లెవెల్) పరీక్ష రెండు దఫాలు గా అనగా ఉదయం 9.30 ని నుండి 11.30 ని. వరకు
పేపరు-I (MAT) మరియు మద్యాహ్నం 2.00 గం. నుండి 4.00 గం. వరకు
పేపరు-II (SAT) జరుగును.
పరీక్ష రుసుము రూ.200/- లను చలానా
రూపంలో ఆన్ లైన్ అప్లికేషన్ లో ఇచ్చిన NTSE Payment ట్యాబ్ ద్వారా
మాత్రమే చెల్లించవలను అని ప్రభుత్వ పరీల సంచాలకులు తెలియజేసారు. పూర్తి వివరముల
కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గాని, ప్రభుత్వ
పరీక్షల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in
లో గాని సంప్రదించగలరు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు
ప్రారంభ తేదీ: 29-10-2021
దరఖాస్తు రుసుము చెల్లించుటకు
ప్రారంభ తేదీ: 30-10-2021
ఆన్ లైన్ లో అప్లై చేసుకొనుటకు
చివరి తేదీ: 30-11-2021 15-12-2021
పరీక్ష రుసుమును చెల్లించుటకు చివరి
తేదీ: 01-12-2021 16-12-2021
నామినల్ రోల్స్ ను
ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లో
సమర్పించుటకు చివరి తేదీ: 06-12-2021 18-12-2021
NTSE
PRESS NOTE 27-10-2021 ENGLISH
0 Komentar