Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Biennial Elections to AP&TS: Notification Released for MLA Quota MLC Elections in Telugu States

 

Biennial Elections to AP&TS: Notification Released for MLA Quota MLC Elections in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


UPDATE 09-11-2021

తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు...ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.

నేటి (Nov 9) నుంచి ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

ఈ నెల 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు యంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

A.P NOTIFICIATION

TS NOTIFICATION

==================================

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్‌ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. 

ఎమ్మెల్సీలుగా ఏపీలో చిన గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజు.. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఎన్నికల ప్రక్రియ

నోటిఫికేషన్ : నవంబరు 9

నామినేషన్ల దాఖలుకు తుది గడువు- నవంబరు 16

నామినేషన్ల పరిశీలన- నవంబరు 17

నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ- నవంబరు 22

పోలింగ్‌- నవంబరు 29

ఓట్ల లెక్కింపు- నవంబరు 29

CLICK FOR DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags