APPSC: Entrance Examination for
Admission of Girls Students into RIMC, Dehradun for The Term July-2022
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ
కాలేజీలోకి బాలికలకు ప్రవేశ పరీక్ష జూలై-2022 టర్మ్ – వివరాలు ఇవే
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలోకి బాలికలకు ప్రవేశ అవకాశాన్ని కల్పించనున్నట్లు
ఏపీపీఎస్సీ గురువారం తెలిపింది. 2022 జూలై టర్మ్ నుంచి 8వ తరగతిలోకి ఈ
ప్రవేశాలుంటాయని పేర్కొంది.
2022 జూలై 1 నాటికి 11 ఏళ్ల నుంచి
13 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు ఈ ప్రవేశాలకు అర్హులు. 7వ తరగతి చదువుతున్న వారు, లేదా
పాసై ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. వీరికి ప్రవేశ పరీక్ష 2021 డిసెంబర్ 18న
విజయవాడలో నిర్వహిస్తారు. ప్రాస్పెక్ట్, అప్లికేషన్ ఫారాల
కోసం అభ్యర్థులు ఓసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు
రూ. 555 వెబ్సైట్లో ఆన్లైన్ లో చెల్లించాలి.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను
ధ్రువపత్రాలతో అసిస్టెంట్ సెక్రటరీ (పరీక్షలు), ఏపీపీఎస్సీ కార్యాలయం,
ఆర్ అండ్ బీ భవనం, మున్సిపల్ స్టేడియం ఎదురుగా,
విజయవాడ చిరునామాకు నవంబర్ 15 లోగా అందించాలి.
దరఖాస్తుల చివరి తేదీ: నవంబర్ 15, 2021
ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2021
0 Komentar