Axis Bank to Waive 12 EMIs on Select
Home Loans Under Its Festive Offer
గృహరుణాలపై 12
ఈఎంఐల రద్దు యాక్సిస్ బ్యాంక్ - వివరాలు ఇవే
గృహరుణ పథకాలపై 12
నెలవారీ వాయిదాలను (ఈఎంఐ) రద్దు చేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
పండగల వేళ.. పలు కొనుగోళ్లపై రాయితీలనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ద్విచక్ర
వాహనాల కొనుగోలుకు ఆన్‌రోడ్ ధర మేరకు రుణాలను ఎలాంటి పరిశీలనా రుసుము లేకుండా
ఇస్తున్నట్లు వెల్లడించింది. వ్యాపార సంస్థలకు టర్మ్ రుణాలతో పాటు, వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక రుణాలను ఇస్తున్నట్లు పేర్కొంది.
దీపావళి ప్రత్యేక ఆఫర్ల పేరిట
ఇస్తున్న రాయితీలు యాక్సిస్ డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే
కొనుగోళ్లకు వర్తిస్తుంది. 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 దుకాణాల నుంచి కొనుగోలు చేసినప్పుడు 20 శాతం వరకు
రాయితీ లభిస్తుందని బ్యాంకు రిటైల్ రుణాల విభాగాధిపతి సుమిత్ బాలి తెలిపారు.
ప్రముఖ బ్రాండ్లతో పాటు, స్థానిక దుకాణదారుల దగ్గరా ఈ ఆఫర్లు
ఉంటాయని చెప్పారు.
0 Komentar