CBSE Class 10, 12 Term-I Date Sheet
Released; Check Exam Schedule
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
సీబీఎస్‌ఈ 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల టర్మ్-1 పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. పదో తరగతి మేజర్ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11వరకు జరుగుతాయి. 12వ తరగతి మేజర్ సబ్జెక్టుల పరీక్షలు డిసెంబర్ 1న మొదలై 22వరకు సాగుతాయి. రెండు తరగతుల పరీక్షలూ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. పదోతరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్ 17 నుంచి, 12వ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. వీటి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు.
కరోనా నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షలను రెండు భాగాలుగా విభజించింది.
టర్మ్-1లో పరీక్షలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఈ టర్మ్
అయిపోయిన వెంటనే మార్కుల జాబితా రూపంలో ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఎవరినీ పాస్,
కంపార్ట్‌మెంట్ లిస్ట్‌లో పెట్టరు. రెండు టర్మ్‌ల పరీక్షలు
అయిపోయిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడిస్తారు. రెండో టర్మ్ పరీక్షలు
ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరుగుతాయి.
12వ తరగతి పరీక్షల షెడ్యూల్ 👇
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 👇
0 Komentar