FA1 2021-22: Evaluation Procedure,
Questionnaire Pattern Details Here - Examination Papers from SCERT
FA1: ఎఫ్‌ఏ-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం విధానం, ప్రశ్నపత్రాల సరళి ఇదే
UPDATE 12-11-2021
FA1 Marks Entry Option Enabled 👇👇
========================
UPDATE ON 31-10-2021
FA1 MARKS ENTRY
FORM (PRIMARY) 👇
FA1 MARKS ENTRY FORM (6 & 7 CLASSES) 👇
FA1 MARKS ENTRY FORM (8, 9 & 10 CLASSES) 👇
===========================
UPDATE ON 25-10-2021
FA-1 పరీక్షల మూల్యాంకనం,
అంతర్గత మార్కుల పరిశీలన కొరకు కమిటీల ఏర్పాటు గురించి ప్రకాశం
జిల్లా DEO గారి ప్రొసీడింగ్స్.
==========================
ఎఫ్‌ఏ-1 (నిర్మాణాత్మక మూల్యాంకనం) పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ
సమాయత్తమైంది. ఒకటి నుంచి అన్ని తరగతులకు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే లఘుపరీక్షలకు ప్రాథమిక విద్య పరిశోధన, శిక్షణ మండలి ద్వారా ప్రశ్నపత్రాలు రూపొందించి ప్రధానోపాధ్యాయులకు
పంపించనున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పంపిస్తే నల్ల/పచ్చబల్లలపై
ప్రదర్శించాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం
పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల సంసిద్ధత కోసం అమలు చేసిన వారధి వర్క్‌షీట్ల
ఆధారంగా ప్రశ్నపత్రాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
మూల్యాంకనం విధానం:
ఎఫ్‌ఏ పరీక్షలకు సంబంధించి
ఇప్పటివరకు పది మినహా అన్ని తరగతులకు పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలు
రూపొందించేవారు. ఇకపై రాష్ట్రస్థాయి నుంచే ప్రశ్నపత్రాలు ఇస్తున్న నేపథ్యంలో
జవాబుపత్రాల మూల్యాంకనంపై దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయుల మూల్యాంకనం తర్వాత
ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేయాలని సూచించారు. ఆ తర్వాత మార్కులను అంతర్జాలంలో
పొందుపరచాలి. తల్లిదండ్రులకు తప్పనిసరిగా ప్రగతిసూచిక(ప్రోగెస్ కార్డు)లు
అందజేయాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్
తరగతులు నిర్వహించాలని నిర్దేశించారు.
ప్రశ్నపత్రాల సరళి:
ఎఫ్‌ఏ-1 పరీక్షల ప్రశ్నపత్రాల సరళి ఇలా ఉండొచ్చని భావిస్తున్నారు. వారధి వర్క్ షీట్లతో పాటు తొలి పాఠ్యాంశాల ప్రాతిపదికగా ప్రశ్నలను రూపొందించనున్నారు. మొత్తం 20 మార్కులకు ప్రశ్నపత్రం ఉండనుంది. వీటిలో ఒక మార్కు చొప్పున బహుళైచ్ఛిక 5, ఖాళీలు 5, రెండు మార్కుల లఘు సమాధాన ప్రశ్నలు 3, నాలుగు మార్కుల వ్యాసరూప ప్రశ్న ఒకటి ఉండే అవకాశం ఉంది.
FA1
2021-22 – Day wise Activity Details and Tests Time Table with Certain
guidelines
FA1
2021-22 – Check the Keys for Tests
FA1:
Formative Assessment-1 Model Papers for Classes 1 to 5
Formative
Assessment Syllabus (A.P.)
FA-1 Tests: Work Books & Work Sheets - Useful for FA-1 Tests 👇👇👇
AP
Varadhi Level-1&2 Students Work Books (Classes 1 to 5)
AP
High School Level Varadhi Work Books (Classes 6 to 10)
AP
High School Level Readiness Programme Work Sheets (Classes 6 to 10)
0 Komentar