Facebook, WhatsApp, Instagram Reconnected After Global Outage
వాట్సప్, ఫేస్‌బుక్,
ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం – దాదాపు 7
గంటల విరామం తర్వాత పునరుద్ధరణ
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన
వాట్సప్ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. సోమవారం రాత్రి 9
గంటల నుంచి సామాజిక మాధ్యమాలు అయిన వాట్సప్, ఫేస్‌బుక్,
ఇన్‌స్టాగ్రాం సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో
వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7
గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సప్
సేవలను పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా సేవల అంతరాయంపై ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్ల మంది ప్రజలకు, వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి క్షమాపణలు. నిలిచిపోయిన మా సేవలను పునరుద్ధరించేందుకు మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. సేవలు పునురుద్ధరణ కావడంతో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని ఫేస్‌బుక్ ట్విటర్‌లో పోస్టు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం సేవలు నిలిచిపోవడంతో ఈ వార్త ఒక్కసారిగా సంచలనమైంది. వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక హైరానా పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. పలువురు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలవైపు దృష్టి సారించారు. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు.
To the huge community of people and businesses around the world who depend on us: we're sorry. We’ve been working hard to restore access to our apps and services and are happy to report they are coming back online now. Thank you for bearing with us.
— Facebook (@Facebook) October 4, 2021
0 Komentar