Finance Ministry Recommends Bank Clerk
Recruitment Exam in Regional Languages
ప్రాంతీయ బాషల్లో బ్యాంకు క్లర్కుల
పరీక్షలు – వివరాలు ఇవే
ప్రభుత్వ రంగ బ్యాంకు క్లర్కుల
పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ... బ్యాంకు సిబ్బంది.
ఎంపిక సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సెనల్ సెలక్షన్-ఐబీపీఎస్)కు
సూచించింది.
ఇంగ్లిష్, హిందీలతో
పాటు 13 ప్రాంతీయ భాషల్లో జరపాలని తెలిపింది. ప్రాంతీయ
భాషల్లో పరీక్షల నిర్వహణపై అధ్యయానికి కమిటీ వేశామని, నివేదిక
అందేవరకు ప్రస్తుత పరీక్షల ప్రక్రియను నిలిపివేయాలని సూచించింది.
ఇకపై 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్కుల భర్తీకి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతాయని పేర్కొంది. భవిష్యత్తులో
స్టేటు బ్యాంకు నిర్వహించే పరీక్షలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
ఇప్పటికే ఎస్ బీఐ ఉద్యోగ ప్రకటన ఇచ్చినందున ఆ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది.
గ్రామీణ బ్యాంకుల పరీక్షలు ఇప్పటికే ప్రాంతీయ భాషల్లో జరుగుతున్నాయి.
@FinMinIndia has recommended that clerical recruitments for 12 public sector banks & vacancies advertised henceforth, both Prelim & Main exams will be conducted in the 13 regional languages along with English & Hindi.
— DFS (@DFS_India) September 30, 2021
Link of the press release: https://t.co/kw5ZYFwzsn
0 Komentar