ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు
1. ❓ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
✅జవాబు:
వేసవి సెలవులు 15 రోజులు కన్నా
తక్కువగా వాడుకుంటే, మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా
భావించి 24 ELs ఇస్తారు.
•••••••••
2. ❓ప్రశ్న: సంపాధిత సెలవును అర్ధ
జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??
✅జవాబు:
ఒకేసారి 180 రోజులకి మించి
వాడుకోకూడదు.
•••••••••
3. ❓ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో
ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??
✅జవాబు:
విరమించుకోవటానికి అతనికి అనుమతి
ఇవ్వరు.
•••••••••
4.
❓ప్రశ్న:
ఉద్యోగ విరమణ
చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??
✅జవాబు:
అతని సర్వీసును ఉన్నతాధికారులు
పొడిగిస్తారు.
•••••••••
5. ❓ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం
ఎప్పుడు ఇవ్వాలి??
✅జవాబు:
ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన
మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే
టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు
పాన్ కార్డు xerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన
డిపాజిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్
చేస్తారు. ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
0 Komentar