ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు
1. ❓ప్రశ్న:
ఒక ఉద్యోగి మరియు అతని పై ఆధార
పడిన వారు దంతాల ట్రీట్మెంట్ కు సర్వీస్ లో ఎన్నిసార్లు మెడికల్ రీయింబర్సుమెంట్
పొందవచ్చు..? ప్రతిసారి ఎంత వరకు బిల్ పెట్టుకోవచ్చు?
✅జవాబు:
👉GO. Ms. no.105. dt;09.04.2007
ప్రకారం...
👉ఉద్యోగి, అతని పై ఆధారపడిన
వారు వేరు వేరుగా (separately) మొత్తం సర్వీస్ లో 3 సార్లు పొందవచ్చు.
👉సీలింగ్ అమౌంట్ 10
వేలు మాత్రమే కావున దాని కన్నా ఎక్కువ బిల్స్ పెట్టిన ఇవ్వరు.
Note: దంతాల అమరిక (కాస్మటిక్స్ సర్జరీ)
కు ఇవ్వరు. అంటే ఎగుడు, దిగుడును క్లిప్స్ వేసి సరి
చేసుకోవటం కొరకు.
•••••••••
2. ❓ప్రశ్న:
12 years ఇంక్రిమెంట్ కు 12
years తరువాత department టెస్ట్ పాస్ ఐతే
ఇంక్రిమెంట్ ఇస్తారా? నేను ఒక ప్రమోషన్ తీసుకున్నాను. అయినా
ఇస్తారా?
✅జవాబు:
12 సంవత్సరాల సర్వీసు
పూర్తి అయ్యేలోపు ప్రమోషన్ తీసుకున్నట్లయితే 12 సంవత్సరాల
ఇంక్రిమెంట్ రాదు. ప్రమోషన్ పోస్ట్ లో మళ్ళీ 6 సంవత్సరాల
సర్వీసు పూర్తి అయినట్లయితే, ప్రమోషన్ పోస్ట్ లో 6 సంవత్సరాల స్కేల్ వస్తుంది. ఒకవేళ ప్రమోషన్ తీసుకోని వారికి ప్రమోషన్
పోస్ట్ ఉండి, దానికి క్వాలిఫై అయినా కూడా, కేవలం వేకెన్సీ లేక ప్రమోషన్ రానందువల్ల AAS 1A ఇవ్వాలి.
ప్రమోషన్ కు ఎప్పుడు క్వాలిఫై అయితే ( 12 సం. తర్వాత)
అప్పటినుండి (ప్రమోషన్ రాని సందర్భాలలో) AAS 1A ఇవ్వాలి.
•••••••••
3. ❓ప్రశ్న:
నేను కానిస్టేబుల్ గా
పనిచేస్తున్నాను. నేను నా యొక్క సర్ name గేజిట్ ద్వారా
మార్చుకున్నాను. నా ఆధార్, pan, చేంజ్ అయినవి. మా sp సార్ కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. నా సర్వీస్ బుక్, APGLI, ఆరోగ్య భద్రత, భద్రత, etc... మార్చటానికి
దానికి sp సార్ ఒక memo ఇచ్చారు మార్చుకోవచ్చు
అని.కానీ నా సందేహం ఏమిటంటే నేను cps ఎంప్లాయ్ ని PRAN
లో నా సర్ name మార్చుకోవాలంటే నేను ఎవరికీ
అప్లై చేయాలి??
✅జవాబు:
S2 form ఫిల్ చేసి డిడిఓ
కవరింగ్ లెటర్ ద్వారా ట్రెజరీ ద్వారా NSDL వారికి అప్లై
చేయండి.
•••••••••
4. ❓ప్రశ్న:
నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి 4
సంవత్సరాలు అయింది. ఇపుడు డిపార్ట్మెంట్ చేంజ్ కావడానికి అవకాశం ఉందా??
✅జవాబు:
సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ లో
జాయిన్ అయిన వారు అదే డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యే వరకూ పని చేయవలసియుంటుంది. ఒక
డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్ కు మారడానికి ఎలాంటి ఉత్తర్వులూ లేవు. కాకపోతే
డిపార్ట్మెంట్ల రద్దు వంటి సందర్భాల్లో సర్ప్లస్ అయితే ఖాళీలు ఉన్న డిపార్ట్మెంట్
కు ప్రభుత్వమే మారుస్తుంది.
I'm working as an Art Teacher in Telangana Minorities residential school. As they said Art teachers do not have promotions, how do we get promotion benefits kindly clarify my doubt.
ReplyDelete