ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు -
సమాధానాలు
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీగా ఏది SR లో
రాయాలి?
✅జవాబు:
జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.
•••••••••
2.❓ప్రశ్న:
నేను CPS ఉద్యోగిని. సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. CPS
మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ
ఫారంలో ఎలా చూపాలి?
✅జవాబు:
30,000/- వరకు 80ccd
(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి) కింద చూయించి పన్ను మినహాయింపు
పొందవచ్చు.
•••••••••
3.❓ప్రశ్న:
ఈ సంవత్సరం రెండు DA లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది. 20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు DA లు గత
సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా?
✅జవాబు:
చూపించుకోవచ్చు. గత సంవత్సరంనకు
చెందిన బకాయిలను ఆయా సంవత్సరాలలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.
•••••••••
4.❓ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్
అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి
అర్హత ఉన్నదా?
✅జవాబు:
ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్
గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్
పోస్ట్ లేనందువలన మీకు అర్హతలతో సంబంధం లేకుండా 24 ఇయర్స్
పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.
•••••••••
5.❓ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను. 6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను. 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి. నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.
✅జవాబు:
మీరు 12
ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ, బి.ఎడ్ లతో పాటు
డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి. మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.
0 Komentar