How To Transfer WhatsApp Data from Old
Phone to New Phone Without Google Drive, iCloud
గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్
లేకుండా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి వాట్సాప్ డేటా బదిలీ ఇలా చేయండి
సోషల్ మీడియా, మెసేజింగ్
యాప్‌లు డేటా భద్రతకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ముఖ్యంగా వాట్సాప్
వంటి మెసేజింగ్ యాప్‌లు యూజర్స్ షేర్ చేసుకునే సమాచారానికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్
సాంకేతికతతో రక్షణ కల్పిస్తుంటాయి. అయితే కొద్ది రోజుల క్రితం యూజర్స్ బ్యాకప్
చేసుకున్న డేటాకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పిస్తున్నట్లు
వాట్సాప్ ప్రకటించింది. దీనివల్ల యూజర్స్ తమ వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్
లేదా ఐక్లౌడ్‌లో స్టోర్ చేసినా సురక్షితంగా ఉంటుందని తెలిపింది.
అయితే క్లౌడ్ స్టోరేజ్‌లో నిక్షిప్తం చేసే సమాచారానికి వాట్సాప్ చెబుతున్నట్లుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉండదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి వాట్సాప్‌లో బ్యాకప్ చేసుకున్న డేటాను గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్‌లో అప్‌లోడ్ చేయకుండా సురక్షితంగా పాత ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం.
కంప్రెస్ యాప్‌లు
ఇందుకోసం మీరు ఆర్‌ఏఆర్ (.rar) లేదా జిప్ (.zip) లాంటి ఫైల్ కంప్రెస్ యాప్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలానే మీ ఫోన్‌కి వైఫైకి కనెక్టయి ఉండకూడదు. ఫైల్స్ అన్నింటి సైజ్ తగ్గించి ఒకే ఫైల్‌గా పంపేందుకు ఉపయోగించే కంప్రెస్ లేదా జిప్ ఫైల్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే ముందు అవి సురక్షితమైనవా? కాదా? అనేది పరిశీలించుకోవాలి. ఇందుకోసం సదరు యాప్‌లకు వచ్చిన రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా లోకల్ బ్యాకప్
పాత ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్
చేసి అందులో కుడివైపున మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఆప్షన్
కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత ఛాట్ ఆప్షన్‌లో ఛాట్ బ్యాకప్‌పై క్లిక్
చేసి బ్యాకప్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ స్టోరేజ్‌లో లోకల్ బ్యాకప్
ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేయమని
స్క్రీన్ మీద కనిపించినా..మీరు దాన్ని పట్టించుకోనక్కర్లేదు. తర్వాత మీ పాత ఫోన్
నుంచి వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
జిప్ ఎలా చేయాలంటే?
తర్వాత మీ కొత్త ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆర్‌ఏఆర్ లేదా ఏవైనా ఇతర ఫైల్ కంప్రెసింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్‌లో ఫోన్‌లోని ఇంటర్నల్ స్టోరేజ్‌కి సంబంధించిన డేటా కనిపిస్తుంది. అందులో ‘Android/Media’ ఫోల్డర్‌లో ‘com.whatsapp’ అనే ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి యాడ్ ఆర్కైవ్ అనే బటన్ క్లిక్ చేయాలి. కొన్ని యాప్‌లలో ఆర్కైవ్ బటన్ యాప్‌లో కుడివైపున ఉన్న ‘+’ సింబల్‌పై క్లిక్ చేస్తే కనిపిస్తుంది. తర్వాత మీ వాట్సాప్ డేటా మొత్తం ఒకే ఫైల్‌గా ‘.rar’ లేదా ‘.zip’ ఫార్మాట్‌లోకి మారుతుంది.
కొత్త ఫోన్‌లోకి బదిలీ
తర్వాత జిప్ ఫైల్‌ని బ్లూటూత్
లేదా నియర్ షేర్ వంటి ఫీచర్ల ద్వారా కొత్త ఫోన్‌లోకి బదిలీ చేయాలి. తర్వాత
కంప్రెస్ యాప్‌ల సాయంతో ఫైల్‌ని అన్‌జిప్ చేయాలి. కొత్త ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్
చేకోవాలి. యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే క్రమంలో డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్
ఎంపిక చేసుకోమని సూచిస్తుంది. మీరు దాన్ని ఓకే చేయకుండా ఉంటే ఫోన్ స్టోరేజ్‌లో ఫైల్స్‌ని
చూపిస్తుంది. వాటిని రీస్టోర్ చేస్తే మీ పాత ఫోన్ వాట్సాప్‌లో బ్యాకప్ చేసుకున్న
డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వస్తుంది. తిరిగి మీరు ఎప్పటిలానే మీ వాట్సాప్
ఖాతాను కొత్త ఫోన్‌లో ఉపయోగించవచ్చు.
0 Komentar