Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

International Day of The Girl Child -2021: History, Importance and Theme - Details Here

 

International Day of The Girl Child -2021: History, Importance and Theme - Details Here

అంతర్జాతీయ బాలికా దినోత్సవం-2021: చరిత్ర, ప్రాముఖ్యత మరియు థీమ్ వివరాలు ఇవే

బాలికలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వారి హక్కులను పరిరక్షించాలి అటూ గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. వారి హక్కులు హరణకు గురికావడమే కాక కనీస గుర్తింపు, గౌరవానికి నోచుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకే అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రారంభమైంది ఇలా...

పౌరహక్కులు అనగానే గుర్తుకువచ్చే తొలిపేరు ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌. 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా కీలక మార్పులు చేశారు. అందులో మ్యాన్‌ అన్న మాటను పీపుల్‌గా ఆమె మార్చారు. నీ అనుమతి లేకుండా ఎవరూ నిన్ను తక్కువగా చూడలేరు. అంటూ మహిళలు తమ ఆత్మగౌరవాన్ని తామే నిలబెట్టుకోవాలని, అందుకు ఎంతటి పోరాటమైనా చేయాలని సూచించారు. అందుకే ఆమె పుట్టిన రోజును అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.

దీనిపై 2011 డిసెంబరు 19న ఐక్యరాజ్య సమితి సమావేశంలో తీర్మానం కూడా చేశారు. బాలురతో పోలిస్తే బాలికలు తక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసినా కూడా కడుపులో ఉన్నతి మైనస్‌ అంటూ పురిట్లోనే చంపేస్తున్న ఘటనలు కోకొల్లలు. భవిష్యత్‌లో అబ్బాయిలతో సమాన స్థాయిలో అమ్మాయిలు అభివృద్ధి కావాలంటే భ్రూణ హత్యలను అరికట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న లింగ అసమానతలపై అవగాహన పెరగాల్సి ఉంది.

మార్పుతోనే సమానత్వం

వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం తదితర అంశాలు బాలికలకు హానిచేస్తున్నాయి. ఈధోరణి సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకి అవరోధంగా నిలుస్తున్నాయి. అందుకే బాల్య వివాహాలను నిరోధించి, హింస నుంచి వారిని రక్షించడానికి కుటుంబం, మిత్రులు, సమాజం అంతా ఐక్యంగా సన్నద్ధం కావాలి. కిశోరీ బాలికలపై జరిగే అకృత్యాలను అంతం చేయడానికి, ఆమెని శక్తివంతురాలిగా చేస్తూ సాధికారిత వైపు పయనింపజేయాల్సింది.

Theme 2021:

This year, the theme has been set as “Digital generation. Our generation,” acknowledging the growing digital world and how a digital gap can also widen the gender gap. 

2021 థీమ్: డిజిటల్ జనరేషన్. మా తరం

ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. అందరిదీను. ఇందులో ప్రభుత్వం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. పౌర సంస్థలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రభుత్వేత్వర సంస్థలు ఏకం కావాలి. కలిసినట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్ధతో కృషిచేయాలి.

విద్యే కీలకం

కిశోరీ బాలికలని స్వశక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. దీనవల్ల సామాజికంగా వెనుకపడిన నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి అనేక మంది ఉన్నతులు తయారౌతారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. కిశోరీ బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ అంశాలపై అవగాహన పెంచాలి. తమను తాము రక్షించుకునే భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. బాలురతో సమానంగా సరైన వనరులు, విద్యను అందించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags