JEE Advanced 2021-IIT Kharagpur: Pandit
Ishwar Chandra Vidyasagar Scholarship to Cover Full Expenses of Students
ప్రవేశాలు పొందిన 100 లోపు
అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు పూర్తి స్కాలర్‌షిప్ చెల్లింపు – నజరానాలు ప్రకటించిన ఐఐటి
ఖరగ్ పుర్
జేఈఈ అడ్వాన్స్డ్ లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు
చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు. ఆ ర్యాంకర్లు ఏయే ఐఐటీల్లో
చేరారు,
ఎంత మంది చేరారు.. అని ప్రతి ఏటా చర్చ సాగుతుంది. దీనిపై ఐఐటీ ఖరగ్
పుర్ ఈసారి దృష్టి సారించి నజరానాలు ప్రకటించింది. పండిత్ ఈశ్వర్ చంద్ర
విద్యాసాగర్ పేరిట విద్యార్థులకు పూర్తి స్కాలర్ షిప్ చెల్లింపు విధానాన్ని
ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించిన ఈ సంస్థ.. విద్యార్థులకు సంబంధించిన ఇతర ఖర్చులనూ
భరించనుంది.
తమ సంస్థల్లో ప్రవేశాలు పొందిన 100
లోపు ర్యాంకర్లు ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి ట్యూషన్ ఫీజులతోపాటు హాస్టల్
రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. పైగా.. పుస్తకాలు, ల్యాప్
టాప్ కొనుగోలు ఖర్చులు, ప్రతి నెలా వ్యక్తిగత ఖర్చుల కోసం
డబ్బులు ఇస్తామని కూడా సంస్థ సంచాలకుడు ఆచార్య వీరేంద్ర కుమార్ తివారీ ఇటీవల
ప్రకటించారు.
గతేడాది వంద లోపు ర్యాంకర్లు ఐఐటీ
బాంబేలో 58 మంది, దిల్లీలో 29 మంది, మద్రాల్లో
ఆరుగురు చేరారు. దేశంలోనే మొదటగా ప్రారంభమైన ఐఐటీ ఖరగ్ పుర్ లో మాత్రం గత
కొన్నేళ్లుగా వంద లోపు ర్యాంకర్లు ఒక్కరూ చేరడం లేదు. దీంతో ఉత్తమ ర్యాంకర్లు తమ
సంస్థల్లో ప్రవేశం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే.. ఆ
విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షల లోపు ఉండాలని నిబంధన విధించింది.
Its our immense pleasure to announce @IITKgp has instituted India’s first-of-its-kind Full Ride Scholarship entitled “PANDIT ISHWAR CHANDRA VIDYASAGAR FULL SCHOLARSHIP FOR TOP 100 JEE (ADVANCED) RANKERS”.#PANDIT_ISHWAR_CHANDRA_VIDYASAGAR_FULL_SCHOLARSHIP#JEE_ADVANCED_RANKERS pic.twitter.com/KeDes9KFgJ
— IIT Kharagpur🇮🇳 #StaySafe (@IITKgp) August 19, 2021
0 Komentar