ITR Website: New Income Tax Portal Will
Not Be Available For 12 Hours This Weekend
12 గంటలపాటు నిలిచిపోనున్న
ఆదాయపు పన్ను వెబ్‌సైట్
నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా
ఆదాయపు పన్ను వెబ్‌సైట్ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుంది. శనివారం
రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10
గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్‌సైటు https:///www.incometax.gov.in లో ప్రకటించింది. ఈ సమయంలో
ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు. ఈ వెబ్‌సైటులో ఇతర సేవలూ అందుబాటులో ఉండవని
ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
ఈ ఏడాది జూన్‌లో పోర్టల్
ప్రారంభించినప్పటి నుంచి ఈ పోర్టల్‌లో సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను
సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను
పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వెబ్‌సైటులో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా
రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం
విదితమే. 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల
ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్‌లో పేర్కొంది.
0 Komentar