Ola Electric Scooters Come to Life at
Women-Powered Future Factory - ‘Girl Power for Green Power’
ఓలా ఎలక్ట్రిక్: ‘‘హరిత శక్తి కోసం నారీ శక్తి’’ ప్రత్యేక వీడియో చూడండి
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి
అడుగుపెట్టిన ‘ఓలా ఎలక్ట్రిక్’.. అరంగేట్రంలోనే రికార్డు విక్రయాలతో సరికొత్త
చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఓలా స్కూటర్ల (Ola Scooters)కు మరో
ప్రత్యేకత కూడా ఉంది. వీటిని తయారుచేస్తున్న వారంతా మహిళలే. ఇందుకు సంబంధించి ఓ
ప్రత్యేక వీడియోను ఆ సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ (Bhavish Aggarwal) ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అందులో ఓలా ఫ్యాక్టరీలో స్కూటర్ తయారీ
కోసం మహిళలు ఎలా కష్టపడుతున్నారో చూపించారు. వీడియో చివర్లో ‘‘హరిత శక్తి కోసం
నారీ శక్తి’’ అంటూ సందేశమిచ్చారు.
తమిళనాడులో ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ (Future Factory) పేరుతో ఓలా అతిపెద్ద తయారీ యూనిట్‌ను ప్రారంభించిన ఓలా సంస్థ.. దీని నిర్వహణ బాధ్యతను పూర్తిగా మహిళలకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో దాదాపు 10 వేల మందికి పైగా మహిళలు విధులు నిర్వహిస్తారని తెలిపింది. తొలి విడత మహిళా ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరి ఓలా ఎస్ 1 (Ola S1), ఎస్ 1 ప్రో (Ola S1 Pro) తయారీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తయ్యాక ఏటా కోటి వాహనాలను ఉత్పత్తి చేయాలని ఓలా (Ola) లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్లో ఓలా
స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసి విక్రయాలు ప్రారంభించింది. తొలి రెండు
రోజుల్లోనే ఏకంగా రూ. 1100 కోట్ల విలువ చేసే స్కూటర్లను విక్రయించి
రికార్డు సృష్టించింది. వీటికి ఆర్డర్లు విపరీతంగా రావడంతో విక్రయాల ప్రక్రియను
నిలిపివేసింది. దీపావళి (Diwali) పర్వదినాన్ని
పురస్కరించుకుని నవంబరు 1న మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్లు
కంపెనీ వెల్లడించింది.
Sneak peak of the scooters in production. The women at our Futurefactory are ramping up production fast! #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/Z0eanudV8X
— Bhavish Aggarwal (@bhash) October 27, 2021
0 Komentar