Ola to Enter Vehicle Sales Business,
Hires Amazon Executive
వాహనాల కొనుగోలుకు ‘ఓలా కార్స్’ పేరుతో
ప్లాట్‌ఫాంను ప్రారంభించిన ఓలా
నూతన, వినియోగ
వాహనాల విక్రయం కోసం ‘ఓలా కార్స్’ పేరుతో ఒక ప్లాట్‌ఫాంను ఓలా ప్రారంభించింది.
ఓలా యాప్ ద్వారా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ‘ప్రస్తుతానికి వినియోగ కార్ల
కొనుగోళ్లకే ఓలా కార్స్‌ను పరిమితం చేయనున్నాం. మున్ముందు కొత్త వాహనాల కొనుగోళ్లకు
వీలు కల్పిస్తాం. ఓలా ఎలక్ట్రిక్ నుంచి దీనిని ప్రారంభిస్తాం. ఇతర బ్రాండ్‌ల
వాహనాలూ ఇందులో ఉంటాయి. 30 నగరాలతో మొదలుపెట్టి వచ్చే ఏడాది
కల్లా 100 నగరాలకు ఓలా కార్స్ సేవలను విస్తరించనున్నామ’ని
ఓలా తెలిపింది.
వాహనం కొనుగోలు దగ్గర నుంచి వాహన
రుణం,
బీమా, రిజిస్ట్రేషన్, నిర్వహణ,
వాహన పనితీరుపై విశ్లేషణ, విడిభాగాలు, చివరకు ఓలా కార్స్‌కే కారును తిరిగి విక్రయించడం వంటి పలు రకాల సేవలను ఓలా
కార్స్ నిర్వహిస్తుందని వివరించింది. అమెజాన్ ఇండియా, రిలయన్స్
ట్రెండ్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అరుణ్ సర్దేశ్‌ముఖ్‌ను ఓలా కార్స్‌కు
సీఈఓగా నియమించారు.
0 Komentar