Promotion Schedule - Permission to take up promotions upto the cadre of Head Masters, Grade-II and School Assistants
ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూలును విడుదల
చేసిన పాఠశాల విద్యా శాఖ - సీనియారిటీ జాబితా 16న విడుదల
ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు
ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
కల్పించేందుకు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఆ
శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం విడుదల చేశారు. స్కూల్
అసిస్టెంట్లు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా, సెకండరీ గ్రేడ్
టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు.
ఈ మేరకు జిల్లాల వారీగా రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టేట్ సబార్డినేట్ నిబంధనల ప్రకారం.. ఇప్పటికే డీఈవోలు జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసిపదోన్నతులకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలను రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవో కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందరికీ కనిపించేలా ఉంచాలి. హెచ్ఎం పోస్టులను ఆయా పేరెంట్ డిపార్ట్మెంట్లకు చెందిన టీచర్లకు పదోన్నతిపై కేటాయించాలి.
» నవంబర్
1 నాటికి పదవీ విరమణ చేసినవారి పోస్టులు, మరణించినవారి
పోస్టులు, ఇతర ఖాళీలను పదోన్నతులకు వీలుగా చూపాలి.
» 2021
జనవరిలో నిర్వహించిన బదిలీల సమయంలో బ్లాక్ చేసిన, ప్రదర్శించినవాటిని
ఖాళీల్లో చూపరాదు.
» ప్రస్తుతం
కల్పిస్తున్న పదోన్నతులన్నీ తాత్కాలిక (అడహాక్) ప్రాతిపదికపై ఉంటాయి.
» బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లు.. వారి ప్రతిభ, సాధించిన ఫలితాలు, ఇతర ప్రాతిపదికల ఆధారంగా ఇచ్చే ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి పదోన్నతులు ఉంటాయి.
షెడ్యూల్
🔰స్కూల్ అసిస్టెంట్, సెకండరీ
గ్రేడ్ టీచర్ల సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 16..
🔰సీనియార్టీ జాబితాలపై అప్పీళ్ల సమర్పణ అక్టోబర్
18,
19..
🔰అప్పీళ్ల పరిశీలన, పరిష్కారం
అక్టోబర్ 21, 22..
🔰తుది సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్
23..
🔰పదోన్నతులకు కౌన్సెలింగ్ అక్టోబర్ 29 నుంచి
30 వరకు..
=====================================
Rc.No. ESE02-13021/7/2019-EST 3-CSE
Date 14-10-2021
Sub: School Education – Permission to
take up promotions upto the cadre of Head Masters, Grade-II and School
Assistants on Adhoc basis – Orders – Issued.
0 Komentar