Reliance JioPhone Next Price Breakup with
All the Plans – Details Here
రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ ధర మరియు
పేమెంట్ వివరాలు ఇవే
జియోఫోన్ నెక్స్ట్ ధరను రూ.6499గా నిర్ణయించినట్లు జియో, గూగుల్ ప్రకటించాయి.
దీపావళి నుంచి ఈ చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు
అందుబాటులోకి రానుంది. జియోఫోన్ నెక్స్ట్ కొనుగోలుకు ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా
జియో ఇవ్వనుంది. రూ.1999 ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని నెలవారీ కిస్తీలతో 18-24 నెలల్లో
చెల్లించవచ్చని వెల్లడించింది. ప్రారంభ స్థాయి విభాగంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు
ఫైనాన్స్ సదుపాయాన్ని అందించడం ఇదే ప్రథమమని వివరించింది. క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో
రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న జియోమార్ట్ డిజిటల్ రిటైల్
స్టోర్లలో లభించనుంది.
పండగల సీజన్‌లో చౌకధర స్మార్ట్‌ఫోన్‌ను భారత వినియోగదారులకు గూగుల్, జియో అందించడం సంతోషకరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందేలా, అందుబాటు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ కోసమే రూపొందించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ చెల్లింపులతో డేటా, టాక్‌టైమ్ ఆఫర్లను
కంపెనీ ఇవ్వనుంది. ఇందుకు ప్రాసెసింగ్ రుసుముగా రూ.501
వసూలు చేయనుంది.
* తెలుగు సహా 10 భారతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు. తెరపై వేరే భాషల్లో ఉన్న
సమాచారాన్ని తమ భాషలోకి మార్చి వినవచ్చు.
* రాత్రిళ్లు కూడా
స్పష్టమైన చిత్రాలు తీయగలిగే కెమేరాలు అమర్చినట్లు సంస్థ తెలిపింది.
* మన భాషలోనే నోటితో సూచనలు
ఇవ్వడం ద్వారా, యాప్‌లను ఓపెన్ చేయొచ్చు.. సెట్టింగులను
మార్చుకోవచ్చు.
జియోఫోన్
నెక్ట్స్‌లో కొత్త ఓఎస్ - ఫీచర్ల వివరాలు ఇవే
For everyone who asked what’s Next?
— Google India (@GoogleIndia) October 29, 2021
We worked with @reliancejio to create a device that is affordable, helpful & brings a unique Android experience to millions of Indians entering the smartphone world.
Presenting #JioPhoneNext, created with Google ➡️ https://t.co/lLh5rjdBef pic.twitter.com/huNWNFsiDI
0 Komentar