SBI Customers can File ITR through SBI
YONO – Steps to Follow and List of documents Details Here
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఉచితంగా
ఐటీఆర్ దాఖలుకి అవకాశం – వివరాలు ఇవే
ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ యోనోయాప్‌లోని ట్యాక్స్2విన్ ఆప్షన్ ద్వారా ఉచితంగా ఆదాయపు పన్ను దాఖలు చేయోచ్చు. దేశీయ ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలు చేసే సదుపాయాన్ని అందిస్తున్నట్లు ఇటివల ప్రకటించింది. మీరు కూడా యోనోయాప్ ద్వారా ఉచితంగా పన్ను దాఖలు చేయాలనుకుంటే ఈ కింది తెలిపిన పత్రాలు ఏర్పాటు చేసుకోవాలి.
యోనోయాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు
కావలసిన పత్రాలు..
1. పాన్ కార్డ్
2. ఆధార్ కార్డ్
3. ఫారం 16
4. పన్ను మినహాయింపు వివరాలు
5. వడ్డీ ఆదాయం సర్టిఫికేట్లు
6. పన్ను ఆదా పెట్టుబడికి సంబంధించిన ఫ్రూఫ్‌లు
ఎస్‌బీఐ కస్టమర్లు యోనోయాప్
ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాలి. అవేంటో ఇప్పుడు
చూద్దాం.
* ముందుగా ఎస్‌బీఐ యోనో
యాప్‌కి లాగిన్ అవ్వాలి.
* 'షాప్స్ అండ్ ఆడర్స్'
ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ‘View All’ ఆప్షన్ మీద క్లిక్
చేయండి.
* 'ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్'
సెలక్ట్ చేసుకుని అక్కడ కనిపించే 'ట్యాక్స్2విన్' ఎంచుకోవాలి.
* ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను ఫాలో అవుతూ ఐటీఆర్ సులభంగా దాఖలు చేయవచ్చు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల
బోర్డ్..సిబిడిటి ఆర్థిక సంవత్సరం 2020-21గానూ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు రిటర్నులు దాఖలు
చేసేందుకు, గడువు తేదిని డిసెంబరు31,2021 పెంచుతున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా
గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే మరోసారి ఈ గడువును పొడిగించింది.
Do you want to file an ITR? You can do it FREE with Tax2win on YONO. All you need is 5 documents. Download now: https://t.co/BwaxSb3HYQ#YONO #Tax2Win #ITR #Offer pic.twitter.com/NXB32NNB60
— State Bank of India (@TheOfficialSBI) October 5, 2021
0 Komentar