Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI General Suraksha Support Scholarship 2021-22: Apply Online - Check the Details Here

 

SBI General Suraksha Support Scholarship 2021-22: Apply Online - Check the Details Here

ఎస్‌బీఐ విద్యార్థుల కొరకు రూ.38,500 వరకూ స్కాలర్‌షిప్‌ – ఎస్‌బి‌ఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ పేరుతో సాయం

SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం పేరు SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చేయూత అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంను అందిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం పేరు SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్.

క‌రోనా కార‌ణంగా త‌ల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవ‌నోపాధి కోల్పోయిన కుటుంబ విద్యార్థుల‌కు ఈ స్కాల‌ర్‌షిప్‌ను అందించ‌నున్నారు. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ఎంపికైన వారికి విభాగాల వారీగా రూ.29,500 నుంచి రూ.38,500 వ‌ర‌కు రివార్డు అందించ‌నున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

ముఖ్య స‌మాచారం:

స్కాల‌ర్‌షిప్ పేరు: SBI జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్

అర్హ‌త‌లు: కోవిడ్ కార‌ణంగా ప్రభావితమైన‌ 9 నుంచి 12 తరగతి, గ్రాడ్యుయేషన్ చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు: 9 నుంచి 12 త‌ర‌గ‌తి చ‌దువుతున్న వారికి రూ.29,500- గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న వారికి రూ.38,500

ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: అక్టోబ‌ర్ 31, 2021


ఎంపిక విధానం:

ఎస్‌బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను అకడమిక్ మెరిట్, సామాజిక-ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముందుగా దరఖాస్తుదారుల అకడమిక్ మెరిట్, ఆర్థిక నేపథ్యం ప‌రిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులను టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు.

అనంత‌రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక చేస్తారు.

 

ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు:

పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు

కుటుంబ పెద్ద‌ జీతం స్లిప్, ఫామ్‌ 16, ఆదాయ ధ్రువీక‌ర‌ణ‌ పత్రం

విద్యార్థి మునుపటి విద్యా అర్హత యొక్క మార్క్ షీట్

ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశ రుజువు (ఫీజు రసీదు/ప్రవేశ లేఖ/సంస్థ గుర్తింపు కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)

కోవిడ్ సంక్ష‌భం రుజువు (కుటుంబ పెద్ద‌ మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఉద్యోగం కోల్పోయిన రుజువు)

స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా వివరాలు (రద్దు చేసిన చెక్/పాస్‌బుక్ కాపీ)

 

CHECK THE DETAILS AND APPLY HERE

DOWNLOAD APP

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags