SBI Informs about OTP-Based Cash
Withdrawal System for Customers
ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ
విధానం అప్డేట్ ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు, ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంల వద్ద జరిగే అనధికారిక లావాదేవీలను నుంచి ఖాతాదారులకు ఈ విధానం రక్షణ కల్పిస్తుంది. రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ విధానం.. మోసగాళ్ల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పిస్తుందని ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపింది. అయితే ఈ విధానం ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది.
ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా
సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
* ఈ విధానంలో ఎస్‌బీఐ
ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు ఓటీపీ అవసరం.
* ఖాతాదారుడు బ్యాంకు వద్ద
రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
* ఓటీపీ అనేది నాలుగు అంకెల
సంఖ్య. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పనిచేస్తుంది.
* ఏటీఎంలో కార్డు ఇన్‌సర్ట్
చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్, విత్‌డ్రా
మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది.
* రిజిస్టర్డ్ మొబైల్
నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే క్యాష్ వస్తుంది.
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T
— State Bank of India (@TheOfficialSBI) October 24, 2021
0 Komentar