SBI PO Recruitment 2021: Admit Cards Released for Preliminary Exams
ఎస్బీఐ పీఓ 2021 అడ్మిట్ కార్డుల విడుదల
UPDATE ON 09-11-2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అడ్మిట్
కార్డులను విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, పాస్ వర్డ్ ను ఉపయోగించి
సంబంధిత వెబ్ సైట్ లో 2021 నవంబరు 27 లోపు
అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష 100 మార్కులకు
ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఈ నవంబరు 20, 21, 27 తేదీల్లో
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
===============================
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్
ప్రమోషన్ విభాగం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 2056 (రెగ్యులర్
పోస్టులు-2000, బ్యాక్ లాగ్ పోస్టులు-56)
అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన
ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది! సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
అర్హులే.
వయసు: 01.04.2021 నాటికి 21 నుంచి
30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు
మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ
ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ప్రిలిమినరీ
పరీక్ష మొత్తం 100 మార్కులకి ఆన్లైన్ లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో
ఉంటుంది. మూడు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు (గంట)
ఉంటుంది.
1) ఇంగ్లిష్ లాంగ్వేజ్: 30
ప్రశ్నలు - 20 నిమిషాలు
2) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 35
ప్రశ్నలు - 20 నిమిషాలు
3) రీజనింగ్ ఎబిలిటీ: 35
ప్రశ్నలు - 20 నిమిషాలు
* ఈ పరీక్షలో సాధించిన అగ్రిగేట్
మార్కుల ఆధారంగా కేటగిరి వైజ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సెక్షనల్ కటాఫ్ ఉండదు.
ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెయిన్ ఎగ్జామ్ కి షార్ట్ లిస్ట్
చేస్తారు.
* మెయిన్ ఎగ్జామినేషన్లో
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్టులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్
పరీక్షా సమయం : గంటలు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు, 200
మార్కులకి ఉంటాయి.
1) రీజనింగ్ అండ్ కంప్యూటర్
ఆప్టిట్యూడ్: 45 ప్రశ్నలు - 60
మార్కులు - 60 నిమిషాలు
2) డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌టీషన్: 35 ప్రశ్నలు - 60 మార్కులు - 45 నిమిషాలు
3) జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్: 35
ప్రశ్నలు - 40 మార్కులు - 40 నిమిషాలు
• డిస్క్రిప్టివ్ టెస్ట్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి 50 మార్కులకి ఉంటుంది . పరీక్షా సమయం 30 నిమిషాలు
ఉంటుంది.
• ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూని
మాత్రమే 50 మార్కులకి నిర్వహించవచ్చు లేదా 30 మార్కులకి ఇంటర్వ్యూ , 20 మార్కులకి గ్రూప్ ఎక్సర్
సైజ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 05.10.2021.
ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 25.10.2021.
ఫేజ్: 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: నవంబరు 20, 21, 27 తేదీలలో.
ఫేజ్: 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: డిసెంబరు 2021.
ఫేజ్: 3 ఇంటర్వ్యూ (ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్ సైజ్): 2022 ఫిబ్రవరి 2/3 వారం.
0 Komentar