Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Revamped Gold Deposit Scheme: Know Eligibility, Interest Rates and Features

 

SBI Revamped Gold Deposit Scheme: Know Eligibility, Interest Rates and Features

ఎస్‌బీఐ రీవాంప్డ్‌ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌-జీడీఎస్‌) వివరాలు ఇవే


ఎస్‌బీఐ రీవాంప్డ్‌ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌-జీడీఎస్‌) కింద మూడు ర‌కాల డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తోంది. ఎస్‌బీఐ వినియోగదారులు త‌మ బంగారాన్ని `ఆర్‌-జీడీఎస్‌` కింద డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకం కింద భ‌ద్ర‌త‌, వ‌డ్డీ, ఆదాయాలు వస్తాయి. ఆర్‌-జీడీఎస్‌ పథకం కింద దాచిన బంగారానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలో వడ్డీ లభిస్తుంది.

అర్హతలు:

ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి భారతీయ ప్రజలు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, హిందూ అవిభ‌క్త కుటుంబాలు (హెచ్‌యుఎఫ్‌), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కింద రిజిస్టర్‌ అయిన మ్యూచువ‌ల్ ఫండ్‌లు/ఎక‌్స్ఛేంజ్‌- ట్రేడెడ్ ఫండ్స్ వర్గాలకు అర్హత ఉంది. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. 

ప‌రిమాణం:

ఈ పథకంలో చేరడానికి క‌నీసం 10 గ్రాముల ముడి బంగారాన్ని డిపాజిట్‌ చేయాలి. గరిష్ఠ పరిమితి లాంటిది ఏమీ ఉండదు. ముడి బంగారం అంటే నాణేలు, కడ్డీలు నగలు (రాళ్లు, ఇతర మెటల్స్‌ ఉంటే వాటి బరువు లెక్కించరు). 

డిపాజిట్ల ర‌కాలు:

ఎస్‌బీఐ రీవాంప్డ్‌ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌-జీడీఎస్‌) మూడు ర‌కాల డిపాజిట్ల‌ను  అందిస్తోంది. స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) కాల‌వ్య‌వ‌ధి 1 నుంచి 3 సంవ‌త్స‌రాలు. మ‌ధ్య‌ కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎమ్‌టీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 5-7 సంవ‌త్స‌రాలు. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎల్‌టీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 12-15 సంవ‌త్స‌రాలు. 

వ‌డ్డీ రేట్లు:

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ)కి సంవ‌త్స‌రానికి 0.50%. ఒక సంవ‌త్స‌రం నుంచి 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.55%. రెండు సంవ‌త్స‌రాల నుంచి మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.60% చెల్లిస్తారు. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు సంవ‌త్స‌రానికి 2.25%. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు ఒక సంవ‌త్స‌రానికి 2.50%గా ఉంది. 

తిరిగి చెల్లింపు:

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) మెచ్యూరిటీ తేది నాటికి బంగారం లేదా దానికి స‌మాన‌మైన న‌గ‌దును బ్యాంక్‌ చెల్లిస్తుంది. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్, దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎమ్‌టీజీడీ  & ఎల్‌టీజీడీ) మెచ్యూరిటీ తేది నాటికి ప్ర‌స్తుత ధ‌ర ప్ర‌కారం బంగారం విలువ‌కు స‌మాన‌మైన విలువ‌ను క‌ట్టి రూపాయ‌ల‌లో అందిస్తారు. 0.20% ప్రాసెసింగ్ ఛార్జీలు విధిస్తారు. 

ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ:

ఎస్‌టీబీడీ: సంవ‌త్స‌రం లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి త‌ర్వాత వ‌ర్తించే వ‌డ్డీ రేటుపై పెనాల్టీతో ముందస్తు ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఎమ్‌టీజీడీ: వ‌డ్డీపై పెనాల్టీతో మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఇస్తారు.

ఎల్‌టీజీడీ: వ‌డ్డీపై జ‌రిమానాతో ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉప‌సంహ‌రించుకోవ‌డానికి అవకాశం ఉంటుంది.

CLICK FOR DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags