Teacher Promotions in Zone IV: ఉప ఎన్నిక నేపథ్యంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు అమల్లో ఉండడంతో రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఆగింది.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీచర్లకు తలపెట్టిన పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. ఉప ఎన్నిక అనంతరం పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని సూచించింది.
0 Komentar