The Nobel Prize 2021: Tanzanian Novelist
Abdulrazak Gurnah wins Nobel Prize in Literature
ఈ ఏడాది సాహిత్య రంగంలో నోబెల్
బహుమతి గ్రహీత ఇతనే - శరణార్థుల వ్యథకు అక్షర రూపం
సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గర్నాను వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
అబ్దుల్ రజాక్ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. 1963లో బ్రిటిష్ వలస పాలన నుంచి జాంబిబర్ స్వాతంత్ర్యం పొందింది. అయితే ఆ తర్వాత అధ్యక్షుడు అబిద్ కరుమే పాలనలో అరబ్ జాతీయులపై వివక్ష పెరగడమే కగా, వారి ఊచకోతలు జరిగాయి. గుర్నా కూడా ఇదే అరబ్ వర్గానికి చెందిన వారే. దీంతో తన భవిష్యత్తు కోసం ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందడం కోసం కుటుంబాన్ని, దేశాన్ని విడిచి ఇంగ్లాండ్‌కు వచ్చేశారు. అప్పటికి ఆయన వయసు 18ఏళ్లే. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోనే ఉన్నత విద్యను అభ్యసించి. కాంటెర్‌బరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన ఆయన తన
జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. సంస్కృతి, ఖండాల మధ్య
నలిగిపోయిన శరణార్థుల వ్యథను ప్రత్యక్షంగా చూసిన ఆయన వాటికి అక్షర రూపమిచ్చారు. 21ఏళ్ల వయసులోనే నవలలు రాయడం ప్రారంభించిన గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 1994లో ఆయన రాసిన పారడైస్ అనే నవల బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయ్యింది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 7, 2021
The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j
0 Komentar