TS: ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓట్ యాప్‌కు రూపకల్పన - ఓటింగ్ ఎలా? - యాప్ ఎలా పనిచేస్తుంది?
రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఐటీ శాఖ..
సీడాక్.. ఐఐటీ సంయుక్త కృషి
ఓటింగ్ విధానంలో సరికొత్త
రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక
పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్ విధానం రూపుదిద్దుకుంటోంది. మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్
చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర
ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), తెలంగాణ ఐటీ శాఖ, కేంద్ర
ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్, బొంబాయి ఐఐటీ,
భిలాయ్ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్ యాప్
తయారైంది. వివిధ ప్రయోగాలు, పరిశీలనల అనంతరం దీనికి తుదిరూపు
ఇచ్చారు.
దేశంలో ఎన్నో కోట్లమంది ఓటర్లు ఓటు
హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ-ఓటింగ్ విధానం మార్పునకు నాంది
కావచ్చని భావిస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ
(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ-యాప్
తయారైంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా
దీనిని రూపొందించారు. దీని వల్ల దేశంలో ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడి నుంచైనా ఓటు
వేయడానికి అవకాశం ఉంటుంది. సైనికులు, వేర్వేరు ప్రాంతాల్లో
విధులు నిర్వహించేవారు సహా ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ విధానంలో ఓటు వేయడానికి అవకాశం
ఉంటుంది.
ఓటింగ్ ఎలా?
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు
పోలింగ్ రోజున ఈ యాప్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటింగ్‌కు ముందు కూడా
రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న ఫొటో ఓటు
వేసేందుకు ముందు తీసుకున్న ఫొటోలను సరిపోల్చుకున్నాక బ్యాలెట్ పేపర్ డిస్‌ప్లే
అవుతుంది. అప్పుడు ఓటు వేయవచ్చు. ఎవరికి ఓటు వేశారో స్క్రీన్‌పై డిస్‌ప్లే
అవుతుంది. ఎక్కడా వ్యక్తుల ప్రమేయం లేకుండా అంతా సాంకేతికతతోనే సాగుతుంది. ఈ-ఓట్
విధానంలో వచ్చిన ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.
యాప్ ఎలా పనిచేస్తుంది?
ఇందులో రెండు ప్రక్రియలు ఉంటాయి. మొదటిది రిజిస్ట్రేషన్, రెండోది ఓటు వేయడం.
బ్లాక్‌చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ, కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించినందున అవకతవకలకు ఆస్కారం ఉండదు.
* బ్లాక్‌చైన్ టెక్నాలజీలో వివరాలు మార్చడానికి వీలుండదు. ఫొటోలను సరిపోల్చడానికి కృత్రిమమేధ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఫోన్‌ను హ్యాక్ చేయడానికి వీలులేని సాంకేతికతను ఉపయోగించారు.
* ఈ-ఓట్ విధానంలో ఓటు వేయడానికి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడానికి వీలుకాదు.
* లైవ్ ఫొటోతో నిర్ధారణ అయితేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.
* ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.
* రిజిస్ట్రేషన్, ఓటింగ్‌కు ఒకే ఫోన్ నంబరు, మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాలి. ఒకరి బదులు మరొకరు ఓటు వేయడానికి వీలులేని విధంగా సాంకేతికత ఉపయోగించారు.
0 Komentar