TS Inter Examinations: ఇంటర్
మొదటి ఏడాది పరీక్షలు యధాతధం
UPDATE 22-10-2021
TS Inter Exams: చివరి
నిమిషంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
ఇంటర్ పరీక్షల్లో తాము జోక్యం
చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25
నుంచి జరగాల్సిన ఇంటర్ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర
తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ
చేపట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును
కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ
నెల 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి
నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్‌ను తల్లిదండ్రుల
సంఘం ఉపసంహరించుకుంది.
===============================
UPDATE ON 21-10-2021
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం
పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రులు సంఘం ఈ మేరకు
పిటిషన్ దాఖలు చేసింది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని
పిటిషనర్ కోర్టును కోరారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని
పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణపై
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్
ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ఈ నెల 25
నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ఇది వరకే
ప్రకటించిన విషయం తెలిసిందే.
TS
BIE: Inter First Year Exams Schedule - Download Hall
Tickets
0 Komentar