మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి? అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండీ
ప్రతి సందర్భంలోనూ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాల్సిన ధ్రువపత్రంలా మారిపోయింది. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా.. కొత్త సిమ్ తీసుకోవాలన్నా.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ దుర్వినియోగం గురించీ భయాందోళనలు ఉన్నాయి. ఒకవేళ మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం.
12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ఉండే ఆధార్ పత్రమే ఈ మాస్క్‌డ్ ఆధార్. దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం ఉన్న చోట మాత్రం ఇది ఉపయోగపడదనేది గుర్తుంచుకోవాలి. మీకూ మాస్క్‌డ్ ఆధార్ కావాలంటే ఈ దిగువ ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి.
డౌన్‌లోడ్ విధానం:
* UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి
వెళ్లి ‘డౌన్‌లోడ్ ఆధార్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఆధార్ నంబర్/ఎన్‌రోల్‌మెంట్
ఐడీ/ వర్చువల్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేస్తే ఆధార్‌తో జత చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ క్లిక్ చేయాలి.
* ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకునేముందు అక్కడ ఉన్న ‘మాస్క్‌డ్ ఆధార్’ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి.
* ఆ తర్వాత మీకు పీడీఎఫ్
రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్ ఉంటుంది. దానిని ఎలా ఎంటర్
చెయ్యాలో అదే పేజ్ లో క్రింద ఇవ్వబడును.
Combination of the first four letter of
your name (as in Aadhaar) in CAPITAL letters and Year of Birth in YYYY format.
0 Komentar