WhatsApp could be working on a new
Community feature
వాట్సాప్ అప్డేట్: త్వరలో గ్రూప్
ఫీచర్ లాంటి కమ్యూనిటీ ఫీచర్
ఒక గ్రూపుగా ఏర్పడి సామాజిక
మాధ్యమాల్లో తమ ఆలోచనలు ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటారు. ఇందుకోసం ఫేస్‌బుక్, వాట్సాప్‌లో
గ్రూప్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం త్వరలో వాట్సాప్
గ్రూప్ తరహాలో మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. వాట్సాప్ ‘కమ్యూనిటీ’ పేరుతో
దీనిని పరిచయం చేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ యూజర్స్ 2.21.21.6 వెర్షన్ ద్వారా పరీక్షించవచ్చు. పరీక్షల అనంతరం ఈ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ కమ్యూనిటీలో గ్రూప్
ఫీచర్‌కి భిన్నంగా కొత్త ఫీచర్స్ ఉంటాయని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాక్ వాట్సాప్
బీటా (వాబీటా) తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్‌ని
ఏర్పాటు చేసుకోవచ్చని వాబీటా వెల్లడించింది. గ్రూప్ అడ్మిన్ తరహాలోనే
కమ్యూనిటీలను నిర్వహించే వారిని కమ్యూనిటీ మేనేజర్స్ అని పిలుస్తారని సమాచారం.
కమ్యూనిటీ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్స్ సమాచారాన్ని ఎక్కువమందితో పంచుకోగలరని
వాబీటా పేర్కొంది.
కమ్యూనిటీ ఫీచర్ అందుబాటులోకి
వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ఫీచర్‌ను తొలగించే అవకాశం ఉందని పలువురు టెక్
నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లకు
పోటీగా ట్విటర్ కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు
ప్రకటించింది. అయితే వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి.. అది
ఎలా పనిచేస్తుందనేది పూర్తి స్థాయిలో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి
చూడాల్సిందే.
Someone leaked "Community", under development for WhatsApp. We wanted to wait for some screenshots to introduce it.
— WABetaInfo (@WABetaInfo) October 11, 2021
Community is a way for users to organize their WhatsApp groups better. Nothing more, it's not something like Twitter and Facebook. Updates will be following soon...
0 Komentar