WhatsApp Updates: Option to Manage Chats
Backup Size, Community Feature for Group Conversations
వాట్సాప్ ఎన్‌క్రిప్టెడ్ ఛాట్ బ్యాకప్ - ‘మేనేజ్ బ్యాకప్ సైజ్’ - వాట్సాప్ కమ్యూనిటీ – వివరాలు ఇవే
వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి ఎన్‌క్రిప్టెడ్ ఛాట్ బ్యాకప్‌ని తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. తాజాగా ఇందులో ‘మేనేజ్ బ్యాకప్ సైజ్’ అనే మరో ఫీచర్‌ను చేరుస్తున్నట్లు సమాచారం. దీని సాయంతో యూజర్స్ తమ ఛాట్ బ్యాకప్ సైజ్ ఎంత ఉండాలనేది నిర్ణయించుకునే అవకాశం ఉంటుందట. యూజర్ వాట్సాప్ నుంచి బ్యాకప్ చేయాలకున్న వాటిలో ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్ ఫైల్స్‌లో ఏవేవి ఉండాలనేది నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల వాట్సాప్ ఛాట్ బ్యాకప్ సైజ్ పరిమితికి మించకుండా యూజర్ ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ని త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది.
త్వరలో గూగుల్ డ్రైవ్ స్టోరేజ్
బ్యాకప్ సైజ్‌పై పరిమితులు విధించనున్న నేపథ్యంలో వాట్సాప్ మేనేజ్ బ్యాకప్ సైజ్
ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాట్సాప్ బ్యాకప్‌లో
యూజర్స్ వీడియోలతో పాటు అన్ని రకాల ఫైల్స్‌ని స్టోర్ చేసుకునే అవకాశం ఉంది.
దానివల్ల వాట్సాప్ స్టోరేజ్ నిండిన తర్వాత మిగిలిన డేటా క్లౌడ్‌లో స్టోర్
అవుతుంది. అయితే గూగుల్ ఫొటోస్ తరహాలోనే డ్రైవ్ స్టోరేజ్‌పై కూడా పరిమితులు
విధించనుందనే వార్తల నేపథ్యంలో మేసేజ్ బ్యాకప్ సైజ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు
తెలుస్తోంది. దీంతో యూజర్స్ పరిమితికి మించి డేటాని స్టోర్ చేసుకునే అవకాశం ఉండదని
టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీంతోపాటు గూగుల్ కమ్యూనిటీ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చని సమాచారం. గ్రూప్ అడ్మిన్ తరహాలోనే కమ్యూనిటీలను నిర్వహించే వారిని కమ్యూనిటీ మేనేజర్స్ అని పిలుస్తారట.
వాట్సాప్
అప్డేట్: త్వరలో గ్రూప్ ఫీచర్ లాంటి కమ్యూనిటీ ఫీచర్
It's very important to encrypt your WhatsApp backup and, if you are a beta tester on WhatsApp for Android and iOS, you can do it using end-to-end encryption: just open WhatsApp Settings > Chats > Chat Backup > End-to-end Encrypted Backup.
— WABetaInfo (@WABetaInfo) October 13, 2021
Keep the password in a safe place.
0 Komentar