బాలల దినోత్సవం - నవంబర్ 14 - చిన్నారులకు 14 సూత్రాలు
💁️ 1. క్రమశిక్షణ వీడరాదు:
అల్లరికి హద్దులు ఉండాలి. టీవీ, చరవాణి, వీడియో గేమ్స్ కాలక్షేపం కావాలి కాని,
వ్యసనం కారాదు.
💁️ 2. ఆరోగ్యం - మహాభాగ్యం:
చిన్నారులు పిజ్జాలు, బర్గర్లు కాకుండా.. పోషకాహారం తినేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి.
💁️ 3. చదువు వ్యసనం అవ్వాలి:
కథలు, ఇతర పుస్తకాలు చదివితే
ఆసక్తి పెరుగుతుంది. స్కిట్స్, రోల్ ప్లే పద్ధతిలో
బోధించాలి.
💁️ 4. ప్రయోగం - ప్రయోజనం:
ప్రయోగాత్మక విద్యతోనే ప్రయోజనం
చేకూరుతుంది. సైన్సు విజ్ఞాన యాత్రల్లో భాగస్వామ్యం చేయాలి.
💁️ 5. బట్టీకి స్వస్తి:
బట్టీ విధానానికి స్వస్తిపలకాలి. కొత్త అంశాలు
నేర్చుకొనేలా ప్రోత్సహించాలి.
💁️ 6. విషయం ఉండాల్సిందే..:
విషయ పరిజ్ఞానమే ఓ విజ్ఞాన భాండాగారం అని మరవొద్ధు
సమకాలీన అంశాలపై అవగాహన పెంచాలి.
💁️ 7. పాఠ్యపుస్తకం - ప్రామాణికం:
పాఠ్యపుస్తకంలో ఉన్న
అంశాలపై పట్టు సాధించాలి. ఇవే అంశాలు పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయనే విషయాన్ని
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివరించాలి.
💁️ 8. గురుదేవోభవ:
పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. తల్లిదండ్రుల
తర్వాత గురువు స్థానం ఏమిటో వారికి తెలపాలి.
💁 9. స్నేహాలు - జాగ్రత్తలు:
నైపుణ్యం ఉన్న మిత్రులతో
తిరిగేలా ప్రోత్సహించాలి. స్నేహితులను బట్టే పిల్లల ఆలోచనా విధానాలు ఉంటాయి.
💁️ 10. ఆడాలి - గెలవాలి:
ఆటలు మనో ధైర్యం కోల్పోకుండా
చేస్తాయి. బృంద నైపుణ్యాలు పెరుగుతాయి.
💁️ 11. నైపుణ్యమే నడిపిస్తుంది:
చదువుతో పాటు పోటీ ప్రపంచంలో అదనపు నైపుణ్యం
తప్పనిసరి. కళలపై ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి.
💁️ 12. నడిపించే నాయకుడు:
పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ లక్షణాలు
పెరుగుతాయి. పాఠశాలల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం కావాలి.
💁️ 13. కొత్తవాటిపై ఆసక్తి:
ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యం అందిపుచ్చుకోవాలి.
పాఠ్యపుస్తకానికి, లోకజ్ఞానానికి తేడా గుర్తించాలి.
💁️ 14. లక్ష్యంపైనే గురి:
గురువు ఉంటే సరిపోదు గురి ఉండాలి. లక్ష్యసాధన, బరిలోకి దిగడం, గురిచూసి కొట్టడం బాల్యంలోనే
నేర్పించాలి.
*జవహర్ లాల్ నెహ్రూ
బయోగ్రఫీ - టీచర్స్/పిల్లల స్పీచ్ లు*
0 Komentar