Android 12: Seven Notable Features
Coming to Your Smartphone
ఆండ్రాయిడ్ 12లో
కొత్తగా రాబోతున్న ఏడు ఫీచర్లివే!
గూగుల్ తీసుకొస్తున్న అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆండ్రాయి 12. ఇందులో కొత్తగా రాబోతున్న ఫీచర్స్ గురించి ఆండ్రాయిడ్ యూజర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన పిక్సెల్ ఫోన్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను పరిచయం చేసింది. మిగిలిన మోడల్స్‌లో కూడా తర్వలో ఈ ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 12లో రానున్న ముఖ్యమైన ఏడు ఫీచర్లేంటో చూద్దాం.
1. ఇంటర్‌ఫేస్ మారుతోంది
ఆండ్రాయిడ్ 12ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ‘మెటీరియల్ యూ’ అనే డిజైన్‌ను తీసుకొస్తున్నారు. దీని సాయంతో యూజర్స్ తమ ఫోన్లలో యాప్ ఐకాన్ కలర్స్, మెనూ టెక్ట్స్ వంటివి వాల్‌పేపర్‌కు తగినట్లుగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం యూజర్స్ హోమ్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి వాల్‌పేపర్ అండ్ స్టైల్‌ని సెలెక్ట్ చేసి ఫోన్‌లోని స్టాక్ ఆప్షన్ లేదా ఫోన్ ఫైల్స్ నుంచి ఫొటోని సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంపిక చేసుకోమని సూచిస్తుంది. అందులో మీకు నచ్చిన కలర్‌ను సెలెక్ట్ చేస్తే మీ ఫోన్‌లోని యాప్ ఐకాన్, టెక్ట్స్ మారిపోతుంది.
2. వన్-హ్యాండ్ మోడ్
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోన్ మోడల్స్ అన్ని దాదాపు పెద్ద డిస్‌ప్లేతో ఉన్నవే. దీంతో ఈ ఫోన్లను ఉపయోగించేప్పుడు యూజర్స్‌కి ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్ 12లో వన్-హ్యాండ్ మోడ్‌ను పరిచయం చేస్తున్నారు. దీని సాయంతో యూజర్స్ సులువుగా సెట్టింగ్స్ మార్చుకోవడంతోపాటు నోటిఫికేషన్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ కోసం యూజర్స్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ సెక్షన్‌లో గెస్చర్స్‌పై క్లిక్ చేసి వన్-హ్యాండ్ మోడ్‌ని సెలెక్ట్ చేయాలి.
3. గేమర్స్ కోసం
కాలం మారేకొద్దీ సాంకేతికత కొత్త రూపు సంతరించుకుంటోంది. దీంతో పాత కాలం గేమింగ్ డివైజ్‌లు పోయి వాటి స్థానంలో మొబైల్ ఫోన్లలోనే గేమ్స్ ఆడేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొబైల్ తయారీ కంపెనీలు గేమింగ్ ఫీచర్స్‌తో కొత్త డివైజ్‌లను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఆండ్రాయిడ్ 12లో కూడా గేమర్స్ కోసం ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా మొబైల్స్‌లో గేమ్స్ ఆడుతుంటే ఫోన్, మెసేజ్, నోటిఫికేషన్ వంటివి వచ్చినప్పుడు స్క్రీన్ మీద కనిపించడంతోపాటు ఆడుతున్న గేమ్ ఆగిపోతుంది. దీనివల్ల గేమర్స్‌కి చాలా అసౌకర్యం కలుగుతుందనే ఫిర్యాదులు రావడంతో కొత్త ఓఎస్‌లో గేమింగ్ మోడ్‌ని తీసుకొచ్చారు. యూజర్స్ గేమ్స్ ఆడేప్పుడు ఈ మోడ్‌ని ఎనేబుల్ చేసుకుంటే ఫోన్ కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ వంటివి వచ్చినా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అవుతాయి.
4. మైక్రోఫోన్, కెమెరా
ఆండ్రాయిడ్ 12లో అందుబాటులోకి రానున్న మరో ఉత్తమమైన ఫీచర్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో అన్ని యాప్‌లకు మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్‌ని ఆపేయొచ్చు. ఇటీవలి కాలంలో చాలా యాప్‌లు కెమెరా, మైక్రోఫోన్ సాయంతో యూజర్ డేటాను ట్రాక్ చేయడంతోపాటు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా సమాచారాన్ని సేకరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్ డిజేబుల్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
5. కొత్త క్యాలిక్యులేటర్
మెటీరియల్ యూ డిజైన్‌లో భాగంగా ఆండ్రాయిడ్ 12లో కొత్త క్యాలిక్యులేటర్ యాప్‌ని తీసుకొస్తున్నారు. యూజర్ ఇంటర్‌ఫేస్ పెద్దదిగా, రౌండ్ ఎడ్జ్ డిజైన్, రౌండ్ బటన్స్‌తో యూజర్స్ సులవుగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ యాప్‌లో లైట్, డార్క్, సిస్టమ్ డీపాల్ట్ అనే మూడు థీమ్స్ ఇస్తున్నారు. యూజర్ వీటిలో తనకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు.
6. టేక్ మోర్ బటన్
గత ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీస్తే డిస్‌ప్లేలో ఉన్నభాగం మాత్రమే కనిపించేది. తాజా అప్‌డేట్‌లో లాంగ్ స్క్రీన్‌షాట్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీని సాయంతో డిస్‌ప్లే కన్నా ఎక్కువ సైజ్ సమాచారాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ 12 బీటాలో టేక్ మోర్ బటన్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నారు. మీరు స్క్రీన్ షాట్‌కు యాడ్ చేయాలనుకున్న సమాచారాన్ని ఎక్స్‌పాండ్ ది స్క్రీన్‌షాట్ లేదా క్యాప్చర్ మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డేటా యాడ్ అవుతుంది. తర్వాత స్క్రీన్ షాట్ తీస్తే మొత్తం స్క్రీన్ షాట్ ఫోన్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది.
7. యూఆర్‌ఎల్ షేరింగ్
ఇవేకాకుండా యూఆర్‌ఎల్ ఫంక్షన్
ఆప్టిమైజేషన్ (యూఆర్‌ఎల్ షేరింగ్) ఫీచర్ తీసుకొస్తున్నారు. యూఆర్‌ఎల్ షేరింగ్
ఫీచర్ సాయంతో యూజర్ యాప్ బ్యాక్‌గ్రౌండ్ కార్డ్‌లోని లింక్‌ని సులభంగా కాపీ
చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు క్రోమ్ బ్రౌజర్ యాప్‌లో ఏదైనా పేజ్ ఓపెన్ చేశారు.
తాజా అప్‌డేట్‌లో క్రోమ్ బ్రౌజర్ కుడివైపు పైభాగంలో లింక్ ఫీచర్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేస్తే ఫోన్ స్క్రీన్ పైన పేజ్ లింక్ కనిపిస్తుంది. దాన్ని కాపీ
చేసుకుని మీరు ఎవరికీ పంపాలనుకుంటున్నారో వారితో ఆ లింక్‌ను సులభంగా షేర్
చేసుకోవచ్చు.
0 Komentar