Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Android Users Alert! Uninstall These 7 Apps with Joker Malware

 

Android Users Alert! Uninstall These 7 Apps with Joker Malware

Joker Malware: జోకర్‌ రీఎంట్రీ - ఇంకా మీ మొబైల్‌ ఫోన్స్‌లో ఈ యాప్స్‌ ఉంటే మాత్రం తక్షణమే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి

Joker Malware - ఈ వైరస్‌ పేరు వింటే చాలు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఈ ప్రమాదకర వైరస్‌ 2017లో బయటపడింది. స్మార్ట్‌ ఫోన్‌లలోకి (Smart Phones) చొరబడే ఈ వైరస్‌ ఫోన్‌లలో ఉండే విలువైన సమాచారాన్ని మనకు తెలియకుండానే కాజేస్తుంది. అప్పుడప్పుడు కనిపిస్తూ మాయమవుతూ వస్తున్న ఈ వైరస్‌... మళ్లీ కలకలం రేపింది.  ఏడు ఆండ్రాయిడ్ యాప్స్‌లో (Android Apps) మళ్లీ ప్రత్యక్షమైనట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ తెలిపింది. ఆ యాప్స్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ (Google PlayStore) కూడా తొలగించింది. ఇంకా మీ మొబైల్‌ ఫోన్స్‌లో ఉంటే మాత్రం తక్షణమే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి..

యాప్స్‌ ఇవే 👇

1. నౌ స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌(Now scan QRcode)

2. ఎమోజీ వన్‌ కీబోర్డు(EmojiOne Keyboard)

3. బ్యాటరీ ఛార్జింగ్‌ యానిమేషన్స్‌ బ్యాటరీ వాల్‌పేపర్‌(Battery Charging Animations Battery Wallpaper)

4. డాజ్లింగ్ కీబోర్డ్‌(Dazzling Keyboard)

5. వాల్యూమ్‌ బూస్టర్‌ లౌడ్‌స్పీకర్‌(Volume Booster Loudspeaker)

6. సూపర్‌ హీరో-ఎఫెక్ట్‌(Superhero-Effect)

7. క్లాసిక్‌ ఎమోజీ కీబోర్డు(Classic Emoji Keyboard) 

ఈ జోకర్‌ వైరస్‌ 2017లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులందరినీ హడలెత్తించింది. మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడమే కాకుండా హ్యాకర్లు (Hackers) ఆ సమాచారాన్ని డార్క్‌ వెబ్‌లో (Dark Web) అమ్మకానికి పెట్టేస్తుంటారు. ఈ వైరస్ యూజర్ అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసి మన బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తోంది. అప్పట్లో పలు యాప్‌ల ద్వారా  మొబైల్‌ ఫోన్లలోకి ప్రవేశిస్తుందంటూ  గూగుల్‌ కొన్ని యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది కూడా.

వైరస్ ఎలా వస్తుంది

కొత్త జోకర్ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు హ్యాకర్స్‌ మూడు పద్ధతులను అనుసరిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security) సంస్థలు గుర్తించాయి. మొదట యూఆర్‌ఎల్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా మాల్‌వేర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టడం. రెండోది ఒకటి లేదా అంతకుమించి స్టేగర్ పేలోడ్స్‌ను డౌన్‌లోడ్ చేసి యూఆర్‌ఎల్‌ల ఏఈఎస్‌ (అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్స్)లను ఏమార్చి డేటాను దొంగలించడం. చివరిగా డేటా ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్స్‌లోకి మాలేవేర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం. ఈ మూడు మార్గాల ద్వారా యూజర్ డేటాను దొంగలిస్తున్నారట.

తప్పించుకోవడానికి ఏం చేయాలి

సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు యాంటీ వైరస్‌ (Anti Virus) సాప్ట్‌వేర్ ఉపయోగించడంతోపాటు కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేసేప్పుడు అనుమతులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జోకర్‌ మాల్‌వేర్‌ను అప్‌డేట్ చేసి  కెమెరా, గేమింగ్, మెసేజింగ్, ఫొటో ఎడిటింగ్, ట్రాన్స్‌లేషన్, వాల్‌పేపర్ యాప్స్‌పై దాడి చేస్తున్నట్లు గుర్తించామని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags