BCCI Appoints Rahul Dravid as Head Coach
of Indian Men's Senior Cricket Team
భారత క్రికెట్ జట్టు తదుపరి కోచ్‌గా
రాహుల్ ద్రవిడ్
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. టీమిండియా కోచ్‌గా రాహుల్
ద్రవిడ్‌ను నియమిస్తూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20
ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది.
టీ20 ప్రపంచకప్
తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న సిరీస్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా
వ్యవహరించనున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పాటు
కొనసాగనున్నారు.
టీమిండియా కోచ్‌గా ఎంపికవడంపై
రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘భారత జట్టు కోచ్‌గా ఎంపికవడం ఎంతో
గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుత
కోచ్ రవిశాస్త్రి సారథ్యంలో భారత జట్టు గొప్ప విజయాలు అందుకుంది. ఇదే విధంగా
జట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను. గతంలో ఎన్‌సీఏ, అండర్-19,
ఇండియా-ఎ స్థాయిలో ప్రస్తుత జట్టు ఆటగాళ్లతో పని చేసిన అనుభవం ఉంది.
ప్రతిక్షణం వారి ఆటతీరును మెరుగుపర్చుకొవాలనే అభిరుచి, కోరిక
వారిలో ఉంది. రాబోయే రెండేళ్లలో జట్టు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అన్ని
విధాలా కృషి చేస్తాను’’ అని రాహుల్ ద్రవిడ్ ప్రకటనలో అన్నారు.
🚨 NEWS 🚨: Mr Rahul Dravid appointed as Head Coach - Team India (Senior Men)
— BCCI (@BCCI) November 3, 2021
More Details 🔽
0 Komentar