Evaru Meelo Koteeswarulu to Crown Its
First Crorepati Raja Ravindra – Details Here
ఎవరు మీలో కోటీశ్వరులు: ఈ
షోలో మొదటి సారిగా కోటి గెలిచిన రాజారవీంద్ర – చివరి 3 ప్రశ్నలు ఇవే
సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న సంగతి మనకు తేలిసిందే. ఈ షోలో జూనియర్
ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి
రూపాయలు గెలుచుకున్నారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్
బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల
సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్
కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు.
2000 - 2004 మధ్య హైదరాబాద్‌లోని
వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఇదివరకు సాఫ్ట్‌వేర్,
బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున
ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో
సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ సైబర్
క్రైం విభాగంలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
చివరి 3 ప్రశ్నలు:
13వ ప్రశ్న (రూ.25 లక్షలు):
2020లో ప్రపంచ వ్యాప్తంగా
ప్రాచుర్యం పొందిన ఏ పదం ఇటాలియన్ భాషలో 40 రోజులు అనే
అర్థాన్నిస్తుంది? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ లో కొవిడ్
సంబంధిత పదాలు ఎక్కువగా ఉండటంతో 'క్వారంటైన్' అని సమాధానం చెప్పి రాజారవీంద్ర రూ.25 లక్షలు
గెలుచుకున్నారు. ఎస్సైగా పనిచేస్తూ కరోనా బారినపడ్డ సమయంలో నిర్వర్తించిన బాధ్యతలు
తనకు జవాబు తెలిసేలా చేసిందని అన్నారు.
14వ ప్రశ్న (రూ.50 లక్షలు):
'జాతీయ వైద్యుల దినోత్సవం ఏ
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు జ్ఞాపకార్థం
జరుపుతారు... జవాబు విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ 'ఫిఫ్టీ
ఫీథే' ప్లాన్‌ను ఉపయోగించుకుని 'పశ్చిమ
బెంగాల్' అనే సమాధానం చెప్పి రూ.50
లక్షలు గెలిచారు.
15వ ప్రశ్న (రూ.కోటి):
'1956లో రాష్ట్రాల
పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషను ఎవరు అధ్యక్షత వహించారు?
ఉత్కంఠభరిత వాతావరణంలో సంధించిన తుది ప్రశ్నకు ఆప్షన్లు ఎ). రంగనాథ్
మిశ్ర బి) రంజిత్ సింగ్ సర్కారియా సి) బీపీ మండల్ డి) ఎస్. ఫజల్ ఆలీ అని ఇచ్చారు. 'ఫజల్ ఆలీ' అనే సమాధానం ఎంచుకున్నా రవీంద్ర కొంత
సందిగ్ధంలో పడిపోయారు. మిగిలి ఉన్న లైఫ్ లైన్ 'ఫోన్ ఏ
ఫ్రెండ్ | అవకాశాన్ని వినియోగించుకుని మిత్రుడైన ప్రేమ
కుమార్ సాయం తీసుకున్నారు. అతను సైతం అదే సమాధానం చెప్పటంతో 'ఫజల్ ఆలీ' ఫిక్స్ చేశారు.
తాను గెల్చుకున్న మొత్తంలో కొంత పేద పిల్లలకు విరాళంగా, మిగిలినవి రైఫిల్ షూటింగ్ శిక్షణకు వినియోగించుకుని దేశం తరఫున పోటీల్లో పాల్గొంటానని రవీంద్ర వివరించారు.
ప్రైజ్ మనీకి పన్ను ఎంత?
అయితే, ఆదాయపు
పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి
గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది.
గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం
31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ
పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు. అంటే ఎవరు మీలో
కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000
వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది.
0 Komentar