Farmers in Gujarat to get Rs 1,500 govt
aid to buy smartphones
గుజరాత్ రైతులకు శుభవార్త -
స్మార్ట్ఫోన్ కొనేందుకు
ప్రభుత్వ సాయం
వ్యవసాయ రంగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుకున్న నేపథ్యంలో రైతులను అందులో భాగం చేయాలని నిర్ణయించింది గుజరాత్ ప్రభుత్వం. ఇందుకుగాను స్మార్ట్ఫోన్ కొనుగోలు సాయం కింద అన్నదాతలకు సుమారు రూ. 1,500 వరకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ సంబంధిత ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది.
భూమి కలిగిన ఎవరైనా అర్హులే
భూమి కలిగిన రైతులు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని గుజరాత్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మొత్తం ఖర్చులో రూ.1,500కు మించకుండా 10 శాతం వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఐ-ఖేదుత్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెల్ఫోన్కు సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు ఈ పథకం వర్తించదని తెలిపిన ప్రభుత్వం.. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ దీనిని అర్హులేనని పేర్కొంది.
ప్రభుత్వ పథకాలపై అవగాహన
రైతుల వద్ద స్మార్ట్ఫోన్ ఉండడం ద్వారా
వాతావరణ సమాచారం, పంటను చీడల నుంచి కాపాడుకోవడం, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాల గురించిన సమాచారం తెలుసుకోవచ్చని
ప్రభుత్వం తెలిపింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుంటూ.. నిపుణుల
అభిప్రాయం సేకరించవచ్చని వివరించింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఆమోదం పొందిన
తరువాత.. లబ్ధిదారుడు ఫోన్ కొనుగోలు బిల్లు, మొబైల్ ఐఎంఈఐ
నంబర్, క్యాన్సిల్ చెక్కు వంటి
వాటి కాపీని ప్రభుత్వానికి అందించాలని గుజరాత్ వ్యవసాయ
శాఖ తెలిపింది.
0 Komentar