Google Launches Scholarship for Women in
Computer Science
కంప్యూటర్ సైన్స్ చదివే అమ్మాయిలకు
గూగుల్ నుండి 1000 డాలర్లు స్కాలర్‌షిప్ - వివరాలు ఇవే
కంప్యూటర్ సైన్స్‌ను కెరీర్‌గా
ఎంచుకునే అమ్మాయిలకు గూగుల్ సదావకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ
చేసే విద్యార్థినులకు జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ కార్యక్రమం కింద స్కాలర్‌షిప్
అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు 2022-23 విద్యా
సంవత్సరానికి గానూ వెయ్యి డాలర్లు స్కాలర్‌షిప్ రూపంలో అందుకుంటారు.
చదువులో ప్రతిభతో పాటు వైవిధ్యం, వినూత్న
ఆలోచనల ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. అలాగే 2021-22 అకడమిక్ సంవత్సరంలో ఫుల్‌టైమ్ డిగ్రీ అభ్యసిస్తుండాలి. స్కాలర్‌షిప్
పూర్తయ్యేనాటికి ఏషియా, పసిఫిక్ దేశాలకు చెందిన గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయంలో రెండో ఏడాది డిగ్రీ చదువుతుండాలి. అర్హత కలిగిన
అభ్యర్థులు తమ టెక్నికల్ ప్రాజెక్టులను పేర్కొంటూ రెజ్యుమె/ సీవీని రూపొందించాలి.
400 పదాలకు తగ్గకుండా ఆంగ్లంలో రాసిన వ్యాసాన్ని పంపాల్సి
ఉంటుంది. డిసెంబర్ 10లోపు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు
చేసుకోవాలి. పూర్తి వివరాలకు గూగుల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
0 Komentar