ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు –
సమాధానాలు
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా?
✅జవాబు:
ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు
జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.
◼◼◼◼◼◼◼◼◼◼
2. ❓ప్రశ్న:
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో
ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి?
✅జవాబు:
మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం
ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే
చెల్లించబడుతుంది.
◼◼◼◼◼◼◼◼◼◼
3. ❓ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు. ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.?
✅జవాబు:
Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే
లెక్కించాలి. ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3
ELs జమ చేయకూడదు.
◼◼◼◼◼◼◼◼◼◼
4. ❓ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.?
✅జవాబు:
కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్
ఇన్ ఎయిడ్, ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse
కేటగిరీ గా పరిగణిస్తున్నారు.
◼◼◼◼◼◼◼◼◼◼
5. ❓ప్రశ్న:
ఫిబ్రవరి 29న
విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి
ఇవ్వాలి?
✅జవాబు:
మార్చి1 నుండి
ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్
సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.
0 Komentar