How to Make the Classroom Pleasant?
తరగతి గదిని ఆహ్లాదకరంగా మార్చేదెలా? –
ఆ ఐదు నిమిషాలు
తరగతి గదిని ఆహ్లాదకరంగా మార్చేదెలా? – ఆ ఐదు నిమిషాలు
Prepared by డా: వి. బ్రహ్మరెడ్డి
పరిచయం:
“మీ విద్యాలయాలు మా జైళ్ళ
కంటే అధ్వాన్నంగా ఉన్నాయి.” అని ఒక పోలీసు సూపరింటెండెంట్ అన్నాడు. ఆయన జైళ్ళను
రోజూ చూస్తూనే ఉంటాడు. అవి అధ్వాన్నంగా ఉన్నాయని బాధపడూ ఉంటాడు. (మంచి వాడు
కాబట్టి). ఈ మధ్య విద్యార్థుల ఆత్మహత్యల దర్యాప్తు సందర్భంగా విద్యాలయాలు చూసి
విస్తుపోయాడు. అప్పుడు పై "మాట" అన్నాడు.
* శిక్షణ యివ్వాల్సిన చోట్లు
“శిక్షలు అమలు చేసే చోట్ల” కంటే నికృష్టంగా ఉండటమేంటి?
* తల్లి భాష (మాతృ భాష)
మాట్లాడినందుకు, మెడలో పలక వేలాడదీస్తారు.
* ఇంగ్లీషులో మాట్లాడనందుకు వాతలు
తేలేట్లు కొడ్తారు. ఫీజులు చెల్లించలేదని క్లాసు బయట నిలబడ్డారు.
* ఎనభై వేలు చెల్లించి, ఇంటర్
లో చేరాక, “ర్యాంకులు తెచ్చే పిల్లలూ, ర్యాంకులు
తేలేని పిల్లలు"గా వర్గీకరించబడ్డారు.
* స్కూల్లో మల మూత్రాలు విసర్జించినందుకు ఎల్.కె.జి. పిల్లను ఎండలో కూర్చోబెడ్తారు.
* 2000 మంది ఆడపిల్లలున్న
కాలేజీలో 12 మాత్రమే మూత్ర శాలలుంటాయి. అవి కూడా మనుషుల కంటే
పందులకు అనువుగా ఉంటాయి.
* జూనియర్లను అక్కున చేర్చుకోవాల్సిన సీనియర్లు ర్యాగింగు పేరుతో హింసిస్తారు. ప్రేమతో, సున్నితంగా పెంచబడిన పిల్లలు అంతే సున్నితంగా ఆత్మహత్యలు చేసుకుంటారు.
* డబ్బున్న వారి పిల్లలూ, రాజకీయనేతల పిల్లలూ, అధికారుల పిల్లలూ ఆఖరుకు ఆ స్కూలు టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళకు రారు.
* ఆ విధంగా చివరకు ప్రభుత్వ స్కూళ్ళ
మీద ప్రభుత్వం వారికే ప్రేమ నశిస్తూ వచ్చింది.
Thanks a lot Sir. All the Best.
ReplyDelete