Jio Announces Prepaid Tariff Hikes – Details
Here
జియో ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు - కొత్త ప్లాన్ల వివరాలు ఇవే
ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా ప్రీపెయిడ్ ఛార్జీలను సవరించింది. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు జియో కూడా నడిచింది.
టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచుతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన అన్ని ప్లాన్ల వివరాలను వెల్లడించింది. జియో ఫోన్ సహా, అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్, డేటా-ఆన్స్ ధరలు కూడా పెరిగాయి. జియో ఫోన్ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు జియో పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త ప్లాన్ల వివరాలు
0 Komentar